అమెరికాలో ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ బిట్‌కాయిన్ అడ్రస్‌కి డాలర్లు పంపాలని మెసేజ్ ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామన్న ట్విట్టర్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్, బ్లూ టిక్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. బిట్‌కాయిన్ అకౌంట్ అడ్రస్ పెట్టి డబ్బులు పంపితే రెట్టింపు చెల్లిస్తామని మెసేజ్ ఉంచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జాన్ బిడెన్, ఎలన్ మస్క్, జఫ్ బిజోస్ తదితరుల అకౌంట్లను హ్యాక్ చేసి ఆ మెసేజ్పెట్టారు. దీంతో […]
విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్‌ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన […]
వాషింగ్టన్: మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటుచేసేలా కార్యనిర్వాహక ఉత్తర్వులను తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేస్తున్నారని వైట్‌హౌస్ చెప్పింది. టెలిముండో న్యూస్ చానెల్‌కు ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్మిగ్రేషన్‌పై మాట్లాడిన తర్వాత వైట్‌హౌస్ ఈ ప్రకటన వెలువరించింది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్(డీఏసీఏ) ప్రోగ్రామ్ కింద పౌరసత్వానికి మార్గం ఏర్పడుతుందని ట్రంప్ చెప్పారు. ‘అది చాలా పెద్ద, మంచి బిల్లు కానుంది. మెరిట్ ఆధారిత బిల్లు, దాంట్లో డీఏసీఏ కూడా […]
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా పెద్ద షాక్ ఇచ్చింది. నకిలీ లైసెన్సుల వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించింది. పీఐఏపై యూరోపియన్ యూనియన్ ఇప్పటికే నిషేధం విధించింది. పాకిస్తాన్ నుంచి అమెరికాకు నడిచే పీఐఏ చార్టర్ ఫ్లైట్స్ అనుమతిని రద్దు చేస్తున్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లో సగానికి పైగా పైలెట్ లైసెన్సులు నకిలీవని తేలడంతో ప్రంపచవ్యాప్తంగా పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) […]
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రబలకుండా వెంటనే చనిపోయేందుకు ఉపయోగపడే ‘క్యాచ్ అండ్ కిల్’ ఎయిర్‌ఫిల్టర్‌ను కనిపెట్టినట్లు సైంటిస్టులు వెల్లడించారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే చాన్స్ చాలా వరకు తగ్గుతుందన్నారు. విమానాలు, స్కూళ్లు, ఆఫీసుల్లో వీటిని అమర్చుకోవచ్చన్నారు. మెటీరియల్స్ టుడే ఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ ద్వారా ఇది వెల్లడైంది. కరోనా వైరస్ ఒక్కసారి ఈ ఫిల్టర్ ద్వారా వెళ్తే వెంటనే చచ్చిపోతోందని, 99.8 శాతం ఇది నిజమైందని సైంటిస్టులు చెప్పారు. నిక్కెల్ ఫోమ్ హీటెడ్‌ని […]
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ […]
వాషింగ్టన్: రెండు విమానాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్నది. విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయాయి. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ప్రకటించారు. కాన్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటూ అమెరికా హామీలను నెరవేర్చుకుందాం’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నికల బ్యాలెట్‌కు ఏదైనా పత్రాలను దాఖలు చేశారా అనే విషయం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక తర్వాత వెస్ట్ తన […]