Breaking News

అమెరికా

అతిపెద్ద ఐటీ స్కాం

అతిపెద్ద ఐటీ స్కాం

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది. విష్ణుకు సిస్టర్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. శుక్రవారం ఉదయం ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. అగ్రరాజ్యమైన అమెరికాను సైతం వణికించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పునాది ఇండియాలోనే పడింది. దీనికి సంబంధించిన రియలిస్టిక్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. […]

Read More

కరోనా పుట్టింది వూహాన్​లోనే.. ఇదే సాక్ష్యం!

కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్​ పుట్టిన దేశమైన చైనా సేఫ్​జోన్​లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్​లోనే ఈ వైరస్​ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్​ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్​ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]

Read More
ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకు అవమానం

ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం

క‌మ‌లా హారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు వాషింగ్టన్​: త్వరలో జ‌ర‌గ‌బోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో రాజ‌కీయప‌క్షాల మ‌ధ్య మాట‌లయుద్ధం శృతిమించుతోంది. డెమోక్రాట్లు అంటేనే ఒంటికాలిపై లేచే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా యూఎస్‌లో ఉపాధ్యక్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న ఇండో-అమెరిక‌న్ క‌మ‌లా హారిస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దేశానికి తొలి మ‌హిళ అధ్యక్షురాలైతే అది అమెరికాకు తీవ్ర అవ‌మాన‌క‌రమ‌ని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో ప్రజలెవరూ క‌మ‌లా హారిస్‌ను ఇష్టపడడం లేదన్నారు. నార్త్ క‌రోలినాలో […]

Read More

‘ఆస్ట్రాజెనెకా’ ప్లాప్​.. ఇక రష్యా వాక్సినే గతి

లండన్: కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఓ బ్యాడ్​న్యూస్​.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రాజెనెకా అనే వ్యాక్సిన్​ను రూపొందించింది. క్లినికల్​ ట్రయల్స్ ​కూడా శరవేగంగా ప్రారంభించింది. అయితే మొదటి ఒకటి, రెండు ట్రయల్స్​లో సత్ఫలితాలే వచ్చాయి. కానీ మూడో ట్రయల్​ మాత్రం దెబ్బేసింది. మూడో దశ ట్రయల్స్​లో భాగంగా బ్రిటన్​కు చెందిన ఓ వలంటీర్​కు వ్యాక్సిన్​ ఇవ్వగా అతడికి తీవ్రమైన సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆక్సఫర్డ్​.. […]

Read More

టీకా ఇప్పట్లో రాదు.. ట్రంప్​వి అబద్ధాలు

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై.. కమలా హారిస్​ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్​ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్​ విషయంలో ట్రంప్​ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్​ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్​ ఘోరంగా ఫెయిల్​ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్​ 1నాటికి వ్యాక్సిన్​ […]

Read More
అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్​ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్​ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్​ తొలిసారిగా న్యూహాంప్​షైర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్​ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. […]

Read More

అధ్యక్ష పదవికి ట్రంప్​ నామినేషన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి అధికారికంగా నామినేషన్​ స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వైట్​హౌస్​ సౌత్​లాన్​ నుంచి ఆయన అధ్యక్ష పదవికి నామినేట్​ అయ్యారు. తాను సగర్వంగా ఈ నామినేషన్​ను స్వీకరిస్తున్నట్టు ట్రంప్​ ప్రకటించారు. అనంతరం ట్రంప్​ మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో చేసిన పురోగతికి తాను గర్వపడుతున్నానని చెప్పారు. రెండోసారి తనను గెలిపించేందుకు అమెరికా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రాట్​ అభ్యర్థి జో బిడెన్​​కు అధికారం కట్టబెడితే ఆమెరికాను నాశనం చేస్తాడని […]

Read More
కరోనాను జయించేందుకు తొలి అడుగు

కరోనాను జయించేందుకు తొలి అడుగు

సారథి న్యూస్, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను జయించడంలో ఓ అడుగు ముందుకుపడినట్టే.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్​అందుబాటులోకి రానుంది. రష్యా ముందుగా ప్రకటించిన విధంగానే ఆగస్టు 12న కరోనా టీకా విడుదలచేస్తున్నట్టు ప్రకటించింది. గ్వామ్‌ కోవిడ్‌ వ్యాక్‌ లయో పేరుతో తయారుచేసిన టీకాను విడుదల చేస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. దేశంలో అందరికీ ఈ టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని, ఈ వారంలోనే అది పూర్తవుతుందని పేర్కొంది. రష్యాలోని గమలేయా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, ఆ […]

Read More