సామాజిక సారథి, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]
సారథి న్యూస్, చొప్పదండి: నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు చెందిన బోస్టన్ స్టడీ గ్రూప్(సంస్థ)వారి సహకారంతో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత శనివారం స్మార్ట్ ఫోన్లు అందజేశారని స్వేరోస్మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టిపల్లి అనిల్ కుమార్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్చెప్పిన ఫే బ్యాక్ టు సొసైటీ నినాదాంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నానని తెలిపారు. కలిగెటి శ్రీయ, చింతల లక్ష్మికి ఫోన్లను ఆన్లైన్క్లాసెస్ కోసం అందజేశానని వివరించారు. కార్యక్రమంలో […]
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ 46వ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. ఎలక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను మేజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ కు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించి పరాజయం పొందారు. అధ్యక్షుడిగా […]
ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్టు సమాచారం. కరోనాతో ట్రంప్ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరో 48 గంటలు దాటితే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ‘ఇప్పటికైతే నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ రానున్న కొన్ని గంటలే కీలకం’ అంటూ ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్ట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో ఆయన చికిత్స […]
ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కూడా.. క్వారంటైన్ కి వెళ్లిన యూఎస్ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగలింది. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ […]
కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవానికి లక్షలాది మంది ప్రజలు బలవుతున్నారు. అయితే వివిధ దేశాలు నివేదిస్తున్న మరణాల లెక్కలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా దేశాలు కరోనా మరణాలను చూపించడం లేదని, చాలా దేశాలు వాటిని దాచి పెడుతున్నాయని సర్వత్రా ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ లో భాగంగా యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశం […]
భారీగా బకాయిలు పడ్డ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సరం మాత్రమే చెల్లింపు న్యూయార్క్ : అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నేళ్ళుగా ఆయన ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదిహేనేళ్లలో.. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించారని, అంతకుముందు దాదాపు పదేళ్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్ఫుల్ వ్యాక్సిన్ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]