Breaking News

జాతీయం

కరోనా వ్యాక్సిన్ కోసం ఏ దేశంతోనైనా పనిచేస్తాం

కరోనా వ్యాక్సిన్ కోసం దేశంతోనైనా పనిచేస్తాం

వాషింగ్టన్‌: ప్రపంచంలో ఏ దేశమైనా కరోనా వ్యాక్సిన్​ను తయారుచేస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ స్పష్టంచేశారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్‌ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్‌ మొదటి […]

Read More
సుప్రీం కోర్టుకు రాజస్థాన్​పంచాయితీ

సుప్రీం కోర్టుకు రాజస్థాన్​ పంచాయితీ

న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌‌ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్‌ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ వేయాలని మా లాయర్‌‌ను కోరాను. హైకోర్టు […]

Read More
సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

జైపూర్‌‌: అశోక్‌ గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు సచిన్‌పైలెట్‌ తమతో బేరాలు ఆడారని, డబ్బుల ఆశ చూపించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై సచిన్‌పైలెట్‌ సీరియస్‌ అయ్యారు. అనవసరంగా తనపై ఆరోపణ చేయొద్దని, ప్రతి ఒక్కరూ రూ.ఫైన్‌ కట్టి తనకు క్షమాపణలు పంపాలని నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ మైలేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పైలెట్‌ ఆరోపించారు. గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు పైలెట్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకే సాక్ష్యమని ఎమ్మెల్యే మలింగ […]

Read More

జర్నలిస్టుపై కాల్పులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో విక్రమ్​ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్​ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]

Read More

ఢిల్లీలో ఇంటికే రేషన్​

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి ప్రజలు రేషన్​ కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్​ సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి ఘర్​ఘర్​ రేషన్​ యోజన’ పథకం కింద రేషన్​ను పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి ప్రభుత్వమే రేషన్​ సరుకులను పంపిణీ చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తాము నెరవేర్చామని సీఎం అరవింద్​ కేజ్రీవాల్ చెప్పారు.

Read More
సోనూసూద్‌.. మా దేవుడు

సోనూసూద్‌.. మా దేవుడు

భువనేశ్వర్‌‌: లాక్‌డౌన్‌ కాలంలో పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సాయం చేసి ఆదుకున్నారు. వేలాది మందికి సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఊళ్లకు పంపి తన పెద్ద మనసును చాటుకున్నారు. దూరం వెళ్లాల్సిన వాళ్లకి ఏకంగా ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు వేలాది మంది అభిమానులు ఏర్పాడ్డరు. కాగా, సోనూసూద్‌ సాయంతో కేరళ నుంచి ఒడిశాకు చేరుకున్న ప్రశాంత్‌ అనే వలస కార్మికుడు […]

Read More
షార్ట్ న్యూస్

మంటగలిసిన మానవత్వం

బెంగళూరు: కరోనాభయంతో మనుషుల్లో మానవత్వం మంటగలుస్తుంది. సాటి మనిషిపై కనీసం కనికరం లేకుండా పోతున్నది. తాజాగా బెంగళూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కరోనా భయంతో ఓ గర్భిణిని చేర్చుకోవడానికి మూడు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ మహిళ ఆటోలోనే ప్రసవించింది. గర్భిణి ప్రాణాలతో భయపడగా.. బిడ్డ మాత్రం మృతిచెందింది. ఆసుపత్రులు కనికరం చూపించి ఉంటే ఆ పసికందు బతికేది. ‘కర్ణాటకలో కరోనా చావులు తక్కువగానే ఉన్నాయి. కానీ కరోనా భయంతో ఆస్పత్రులు వైద్యం నిరాకరించడం వల్ల […]

Read More
కాంగ్రెస్​ఎమ్మెల్యేలు మావెంటే

కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు మా వెంటే

జైపూర్‌‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సపోర్ట్‌తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్‌ పైలెట్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్‌ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్‌ కేబినెట్‌ మీటింగ్‌ కూడా నిర్వహించారు. రాజస్థాన్‌ అనిశ్చితి తర్వాత గెహ్లాట్‌ రెండుసార్లు సీఎల్పీ సమావేశం […]

Read More