కోల్‌కతా: కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఆగస్ట్ 31 వరకు లాక్డౌన్ పొడిగించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వారంతపు( వారంలో రెండురోజులు) లాక్డౌన్ విధిస్తున్నారు. ఈద్ సందర్భంగా ఆగస్ట్ 1న లాక్డౌన్ విధించబోమని ఆమె స్పష్టం చేశారు. వారంలో ఏయేరోజు లాక్డౌన్ విధిస్తామో ప్రభుత్వం ముందుగానే తెలియజేస్తుందని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నదన్నారు. కరోనా విపత్తువేళ కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రంపై […]
ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్‌శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌శాఖ అధికారులు చెప్పారు.
ముంబై: దేశ ఆర్థికరాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత మూడు నెలల నుంచి ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ‘ఇది చాలా సంతోషిదగ్గ విషయం. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదేసమయంలో భౌతికదూరం పాటించాలి’ అంటూ ఆ రాష్ట్ర మంత్రి ఆధిత్యథాక్రే ట్వీట్ చేశారు.
నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్బెడ్ షేరింగ్రూమ్) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్ కేసులున్నాయి.
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్‌ఫ్రం హోమ్‌ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అయోధ్య: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కోరారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంపత్ రాయ్ ఈ ప్రకటన చేశారు. దేశంలోని భక్తులందరూ తమ ఇంట్లోనే ఆరోజు పూజలు చేసుకోవాలని సూచించారు. రామమందిర శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కరోనా విపత్తువేళ కేవలం పరిమితమైన సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.