కర్ణాటకలో మొదలైన డ్రగ్స్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది కి డ్రగ్స్ రాకేట్తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె […]
లక్నో: ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ స్త్రీలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లకీంపూర్లో మూడేండ్ల చిన్నారిపై దుండగులు లైంగికదాడి జరిపి.. ఆపై చిన్నారిని చంపేశారు. బుధవారం చిన్నారి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు గ్రామానికి 200 మీటర్ల దూరం మృతదేహం దొరికింది. పోస్ట్‌మార్టం నిర్వహించగా లైంగికదాడి జరిగినట్టు తేలింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తనపై పగతోనే దుర్మార్గులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాని పేర్కొన్నారు. […]
ఐరాస: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువై పేదలు మరింత దారిద్ర్యం బారినపడుతున్నారు. కరోనా వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. పేదరికాన్ని అంతమొందించేందుకు దశాబ్ద కాలంగా తాము చేస్తున్న కృషి వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజాగా దాన్ని సవరిస్తూ 9.1 […]
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ స్పందించింది. అవన్నీ కల్పిత కథలేనని కొట్టిపారేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి అభయ్పేరుతో లేఖను విడుదల చేసింది. ‘గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకం. […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]
ప్రపంచమంతా ఆధునికత వైపు ముందుకెళ్తుంటే.. కాయకష్టాన్ని నమ్ముకున్న వలస కూలీ మాత్రం ఓ పూట తిండి కోసం ఇప్పటికీ అల్లాడుతున్నాడు. ఇలాంటి కన్నీటి గాథలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అయితే ఈ బక్కపల్చటి బతుకుల్లో అంతకుమించిన ఆవేదనను మిగిల్చింది కరోనా. మరీ ముఖ్యంగా మహిళలకు మనసు చెలించే కథలనే రాసింది. కాలం చేసిన గాయాల్లో ఎందరో ఆడ కూతుళ్ల కన్నీటి బొట్లకు ఇవి కొన్ని సాక్ష్యాలు మాత్రమే. రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని కలలో కూడా కోరుకోని […]
సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతు పెరుగుతున్నది. సుశాంత్ ఘటన అనంతరం వెల్లువెత్తిన ఆరోపణలతో రియా చక్రవర్తి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు సమాచారం. తొలుత ఆమె వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో నెట్‌జన్లు ఆమెపై ట్రోలింగ్ మెదలుపెట్టారు. దీనికి తోడు జాతీయమీడియా సైతం రియాపై అనేక కథనాలు వెలువరించింది. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు రియాకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల […]
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘ నాకు లక్షణాలు ఏమీలేవు. కానీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి నా విధులను నిర్వర్తిస్తాను. దయచేసి నన్ను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు ఉన్నా లేకపోయినా వెంటనే పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొండి. కరోనా […]