Breaking News

జాతీయం

పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Read More
మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ మంత్రి తుల్సీ సిలావత్​, అతడి భార్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్​ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్​లోని పలువురు అధికారులు, పోలీస్​ సిబ్బందికి కూడా […]

Read More
అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

జైపూర్​: సచిన్​ పైలట్​ సృష్టించిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​ ఇచ్చింది. అతడి సోదరుడు అగ్రసేన్​ గెహ్లాట్​కు ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) సమన్లు జారీచేసింది. అగ్రసేన్​ రూ.150 కోట్ల ఎరువుల కుంభకోణానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అగ్రసేన్​ను ప్రశ్నించనుంది. ఈనెల 22న ఈడీ అధికారులు అగ్రసేన్​కు చెందిన ఎరువుల కంపెనీపై దాడి చేసి.. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ.. ఈడీని అడ్డం పెట్టుకొని కుట్రలు […]

Read More
విద్యార్థులకు బంపర్​ ఆఫర్​

విద్యార్థినులకు బంపర్​ ఆఫర్

చంఢీఘర్​: పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్​ఆఫర్​ ప్రకటించారు. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్​ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్​ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్​ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్​ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]

Read More
పొగరాయుళ్లు జరభద్రం

పొగరాయుళ్లూ.. జర భద్రం

ఢిల్లీ: పొగ తాగేవళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సిగరేట్లు ద్వారా కరోనాకు వాహకాలుగా పనిచేస్తాయని పేర్కొన్నది. సిగరేట్​ అమ్మే వ్యక్తికి కరోనా ఉంటే.. అవి కొని తాగేవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వారు సిగరెట్​ను తమ చేతితో తాకుతారు అనంతరం పెదవులతో కూడా తాకుతారు. దీంతో కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. […]

Read More
కేరళలో పరిస్థితి మొదటికి..

కేరళలో మళ్లీ మొదటికి

త్రివేండ్రమ్​: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన […]

Read More
సారు మీకిది న్యాయమా..?

సారు మీకిది న్యాయమా..?

సారథి న్యూస్​ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు […]

Read More

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

సారథి న్యూస్​, భువ‌నేశ్వర్: ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ బాలిక సోమ‌వారం త‌న ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువ‌నేశ్వర్​లోని డుమ్‌డుమా ఏరియా ఫేజ్‌-2 లో ఈ దారుణం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న పై స‌మాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. మృత‌దేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేక‌పోవ‌డం ప‌లు అనుమానాలకు తావిస్తుంద‌ని, బాలిక‌ కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటార‌ని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని […]

Read More