Breaking News

జాతీయం

నకిలీ మద్యం తాగి 21 మంది మృతి

నకిలీ మద్యానికి 21 మంది బలి

చండీఘర్​: పంజాబ్​ రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​సింగ్​ న్యాయవిచారణకు ఆదేశించారు. అమృత్​సర్​, బాటాలా, టరన్​టరన్​ ప్రాంతాలకు చెందిన వారు నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ సీఎం అమరీందర్​సింగ్​ ట్వీట్​ చేశారు.

Read More
ఆఫీసు అయింది హాస్పిటల్

ఆఫీసు అయింది హాస్పిటల్​

గుజరాత్​ : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఖాదర్‌ షేక్‌ కరోనా వైరస్‌ సోకి ప్రయివేట్‌ హాస్పిటల్‌లో చేరాడు. 20 రోజుల పాటు ప్రయివేట్‌ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత వారు వేసిన బిల్లు చూసి బిత్తర పోయాడు. ఇలా అయితే పేద ప్రజలు ఎలా వైద్యం చేయించుకుంటారా అనే ప్రశ్న అతన్ని తొలచింది. దీంతో తన ఆఫీసునే హాస్పిటల్‌గా మార్చేశాడు. 85 బెడ్లను ఏర్పాటు చేశాడు. స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకున్నాడు. వైద్య సిబ్బంది, యంత్రాలు, […]

Read More
రైతుల ఖాతాల్లోకి మళ్లీ రూ.2,000

రైతుల ఖాతాల్లోకి మళ్లీ రూ.2,000

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఆగస్టు 1 నుంచి ‘కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి తీపికబురు చెప్పింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా అందిస్తున్న డబ్బును మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేయనుంది. ఆగస్టు 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.రెండు జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాని మోడీ సర్కారు రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్​సమ్మాన్ నిధి స్కీం ద్వారా వారికి […]

Read More
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్​ కార్యకర్తల్లో ఆందోళన రెగ్యులర్​ పరీక్షల నిమిత్తమే.. ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా వెల్లడి న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఆమె రెగ్యులర్ పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. గురువారం (జులై 30) సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే […]

Read More

విదేశీవర్సిటీలకు అనుమతి

ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్​లో తమ క్యాంపస్​లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్​ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్​లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్​ఈపీ(నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ) కంట్రోల్​ చేయనున్నది. […]

Read More
ఫేక్​ మాస్కుల గుట్టురట్టు

నకిలీ మాస్కుల దందా గుట్టురట్టు

ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్​95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్​ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్​ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]

Read More
పోలీసులకు గురిపెట్టాడు

పోలీసులకే గురిపెట్టాడు

ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్​ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్​ గంజ్​కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్​ ఓ పోలీస్​ను రివాల్వర్​తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్​ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

Read More
కాంగ్రెస్​ నేత సోమెన్​ మృతి

పశ్చిమబెంగాల్​ పీసీసీ చీఫ్​ మృతి

కోల్​కతా: పశ్చిమ బెంగాల్​ పీసీసీ అధ్యక్షుడు సోమెన్​ మిత్రా (78) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా సీవోపీడీ ( క్రానిగ్​ అబ్​స్క్రక్టివ్​ పుల్​మోనరీ వ్యాధి)తో బాధపడుతూ కోల్​కతాలోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. సోమెన్​ కరోనాతో మృతిచెందారన్న వార్తల్లో నిజం లేదని ఆసపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్​ వచ్చిందని తెలిపాయి. సోమెన్​ మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, […]

Read More