Breaking News

క్రీడలు

For more details

దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు

దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు

బ్రిడ్జ్​టౌన్​: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్​మెన్​ ఎవర్టన్ వీక్స్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరునెలల క్రితం తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన వృద్ధాప్య సమస్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1925లో బార్బడోస్​లో పుట్టిన వీక్స్.. 1947–58 మధ్యకాలంలో విండీస్ తరఫున 48 టెస్టులు ఆడాడు. 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. ఇందులో 15 శతకాలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1948లో.. 22 ఏళ్ల వయసులో ఇంగ్లండ్(కింగ్​స్టన్​ ఓవల్)పై టెస్ట్ అరంగేట్రం చేసిన వీక్స్.. […]

Read More
నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు

నా మెడపై యూనిస్​ కత్తి పెట్టాడు

న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో సలహాలు ఇచ్చినందుకు ఓసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్.. తనపై మెడపై కత్తిపెట్టాడని కోచ్​గా పనిచేసిన గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ఆ సమయంలో భయపడడం కంటే.. యూనిస్ మూర్ఖత్వానికి నవ్వొచ్చిందన్నాడు. ‘పాక్ జట్టులో యూనిస్ ఖాన్ భిన్నమైన వ్యక్తి. అన్ని నాకే తెలుసు అని భావిస్తుంటాడు. అందుకే అతనికి కోచింగ్ ఇవ్వడం కష్టం. అయితే బ్రిస్​బేన్​(2016)లో జరిగిన టెస్ట్ మ్యాచ్​ సందర్భంగా జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. అల్పాహారం సమయంలో బ్యాటింగ్ […]

Read More
నల్లకార్లతో రేస్

అందుకే నల్లకార్లతో రేస్

లండన్: జాతి వివక్షకు వ్యతిరేకంగా ఫార్మూలా వన్ కూడా గళం కలిపింది. ఈ సీజన్​లో తాము పాల్గొనే ప్రతి రేస్​లో బ్లాక్ కార్లతో బరిలోకి దిగుతామని ఎఫ్–1 టీమ్ మెర్సిడెజ్ ప్రకటించింది. వరల్డ్​లో ఎక్కడా జాతి వివక్ష ఉండకూడదని టీమ్ ప్రిన్సిపల్ టొటోవోల్ఫ్ వెల్లడించాడు. సాధారణంగా మెర్సిడెజ్ కార్లన్నీ సిల్వర్ రంగులో ఉంటాయి. ‘జాతి, వర్ణ వివక్షపై నోరు మెపకుండా ఉండకూడదు. జాతి వివక్షపై మా సంకల్పం, ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో సర్క్యూట్​పై దూసుకుపోతాం. […]

Read More
బ్లాక్ లైవ్ మ్యాటర్స్ లోగోతో బరిలోకి

బ్లాక్ లైవ్ మ్యాటర్స్ లోగోతో బరిలోకి

న్యూఢిల్లీ: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు విండీస్ క్రికెట్ జట్టు కూడా సమాయత్తమైంది. ఈ మేరకు ఇంగ్లండ్​తో జరిగే మూడు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​లో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోతో బరిలోకి దిగనుంది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్​పై దీనిని ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా ఈ లోగోను రూపొందించింది. ఇప్పటికే ప్రీమియర్ లీగ్​కు చెందిన 20 ఫుట్​బాల్​ క్లబ్స్​ ఈ లోగోను ధరించి జాతి […]

Read More
ఒలింపిక్స్​ వద్దంటే వద్దు

ఒలింపిక్స్​ వద్దంటే వద్దు

టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్​ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్​కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1,030 మంది పాల్గొన్నారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు క్రీడలను వాయిదా […]

Read More
ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

ఐసీసీ ఎలైట్ ప్యానెల్​లో నితిన్ మీనన్

దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతను చోటు దక్కించుకున్నాడు. దీంతో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ కోసం ఐసీసీ ప్రకటించిన జాబితాలో నిగెల్ లాంగ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్​కు చోటు కల్పించారు. 3 టెస్టు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్.. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో […]

Read More
కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత

కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత

న్యూఢిల్లీ: కరోనా మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. ఢిల్లీ క్లబ్ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ (53).. వైరస్ బారినపడి మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దోబల్ పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్ ఢిల్లీ అండర్–23 టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్లబ్ క్రికెట్​లో ప్రముఖ క్రికెటర్​గా ఉన్న దోబల్.. ఢిల్లీ అండర్–23 టీమ్​కు సహాయక సిబ్బందిగా కూడా పనిచేశాడు. దీర్ఘకాల వ్యాధులకు […]

Read More
కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా

కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా

లండన్: ఈ ఏడాది ఆరంభంలోనే తనకు కరోనా సోకినా.. దాని గురించి పెద్దగా తెలియకపోవడంతో తీవ్రమైన ఫ్లూగా అర్థం చేసుకున్నానని ఇంగ్లండ్ మాజీ మాజీ ఆల్​రౌండర్​ ఇయాన్ బోథమ్ వెల్లడించాడు. ‘డిసెంబర్ చివర, జనవరి మొదట్లో నాకు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే దీనికి గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో ఫ్లూ చాలా తీవ్రంగా వచ్చిందని తప్పుగా అర్థం చేసుకున్నా. దీని గురించి పెద్దగా తెలియపోవడంతో చాలా రోజుల బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. […]

Read More