సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]
సారథిన్యూస్ ములుగు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న 25 మంది వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించారు. శాంపిళ్లను పరీక్షల కోసం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ ల్యాబ్ కు పంపామని చెప్పారు.
మహబూబాబాద్: ఉపాధిపనులతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబాబాద్ కలెక్టర్ ఏపీ గౌతం పేర్కొన్నారు. గురువారం కేసముద్రం మండలం గాంధీనగర్, కలవల గ్రామాలలో (ఎస్ ఆర్ ఎస్ పి) శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ కాలువలను సందర్శించి పరిశీలించారు. ఉపాధి హామీ పథకం నిధులతో కాలువల్లో పూడికలు, చెరువు పూడిక వంటి పనులను చేపట్టి రైతులకు సాగునీరందించాలన్నారు. అంతకుముందు ఆయన మహబూబాబాద్‌లో పర్యటించారు. రోడ్లపై ఎవరైనా వాహనాలు నింపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఈఈ […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు హెల్త్ సెంటర్లో క్షయ వ్యాధిగ్రస్తుల నుంచి క్షయవ్యాధి(టీబీ) నిర్ధారణ కోసం వైద్యాధికారుల బృందం తెమడను సేకరించింది. బాధితులకు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. అనంతరంపై కరోనాపై జాగ్రత్తలను వివరించారు. తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఈశ్వరమ్మ, శరత్ బాబు, రవి, రజినీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: లాక్‌డౌన్‌తో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన మోడల్ డెయిరీఫామ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ములుగు మండలంలోని పేదలను గుర్తించి వారికి గేదెలను పంపిణీచేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్సీ కార్పొరేషన్, జిల్లా పశుసంవర్థక అధికారి, జిల్లా ప్రణాళికాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కే […]
సారథి న్యూస్, ములుగు: ప్రధాని నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతున్నదని బీజేపీ నాయకుడు భూక్య జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం ములుగులో మోదీపాలన పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంబిడి లక్ష్మణ్ రావు, బుర్ర మహేష్, బైకని రాజు, సాంబరాజు కిరణ్, కన్నెబొయిన వీరెందర్, కొప్పుల రజనికర్, ఆకుల సాంబయ్య, గంగుల రాజు, రామిడి […]
సారథిన్యూస్, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా జడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి సోమవారం దామెర మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె అధికారులతో మాట్లాడి.. మండలం లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యపనులను చేపట్టాలని కోరారు.