Breaking News

రంగారెడ్డి

చేవెళ్లలో గుట్కా సీజ్​

భారీగా గుట్కా ప్యాకెట్లు సీజ్​

సారథిన్యూస్​, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్​ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్​ చేసినట్టు […]

Read More
మార్కెట్ ఆఫీసు ప్రారంభం

మార్కెట్ ఆఫీసు ప్రారంభం

సారథి న్యూస్, చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని శంకర్ పల్లి లో నూతనంగా రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసును ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More
భార్యను చంపిన భర్త

వివాహిత హత్య.. చంపింది తొమ్మిదో భర్త

సారథిన్యూస్​, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్​ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం […]

Read More
మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా మృతి

ఒరిగిన పోరు కెరటం

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా ఇకలేరు శానససభలో ప్రజల తరఫున తనదైన గళం చివరి శ్వాసదాకా ప్రజా ఉద్యమాల్లోనే.. నిజాయితీయే ఆస్తి సారథి న్యూస్​, ఇబ్రహీంపట్నం: పోరు కెరటం నెలకొరిగింది.. ప్రజాగొంతుక మూగబోయింది.. దళిత కిరణం ఆరిపోయింది.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహా ఇక లేరు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. […]

Read More
వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కె.తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఫ్లోరింగ్ సొల్యూషన్స్, కార్పెట్ టైల్స్, గ్రీన్స్(కృత్రిమ గడ్డి), బ్రాడ్‌లూమ్ తివాచీలు (వాల్ టు వాల్ కార్పెట్)లను తయారుచేసేందుకు యూనిట్​ సిద్ధమైంది. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో రూ.రెండువేల కోట్ల పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని మంత్రి కేటీఆర్​అన్నారు. ఈ పారిశ్రామిక క్లస్టర్‌లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా […]

Read More

దళిత యువకుడి హత్యోదంతంపై విచారణ

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం మర్రిపల్లిలో ఇటీవల దళిత యువకుడు కిరణ్ హత్యకు గురయ్యాడు. హత్యకు దారితీసిన ఘటనను సంబంధించిన వివరాలను శనివారం ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ తెలుసుకున్నారు. ఈ హత్యోదంతంపై న్యాయవాదులతో చర్చించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే వారితో మాట్లాడారు. ‘మాదిగ యువకుడు కిరణ్ హత్య కేసులో ఏసీపీ, సీఐ, రైటర్ కూడా నిందితులే, నిందితులకు సహకరించిన వారిని వదిలిపెట్టం. పోలీస్ అధికారులే ఉద్దేశపూర్వకంగా […]

Read More
దళిత యువకుడి దారుణ హత్య

దళిత యువకుడి దారుణ హత్య

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో దళిత యువకుడు ఈర్లపల్లి కిరణ్ (28)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతంపై లోతైన విచారణ సాగిస్తున్నారు.

Read More
టాబ్లెట్స్ లారీలో మంటలు

టాబ్లెట్స్ లారీలో మంటలు

సారథి న్యూస్, షాద్​నగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ వద్ద బెంగళూరు హైవేపై ఆదివారం ఉదయం ఓ కంటెయినర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కన పార్క్ చేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ పొలీసులు ఫైర్ సిబ్బందిని అలర్ట్​చేసి మంటలను ఆర్పివేయించారు. బెంగళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబంధించిన ట్యాబ్లెట్ లోడుతో వస్తున్న కంటెయినర్​శంషాబాద్ ఘాన్సిమియాగూడ వద్దకు రాగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Read More