Breaking News

నల్లగొండ

జూలై 3న మహాధర్నా

సారథిన్యూస్​, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్​, నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నెపర్తి శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాటిల్ మొక్కలు నాటారు. వాతావరణంలో సమతుల్యం లోపించడంతోనే వర్షాలు కురవడం లేదని మంత్రి జగదీశ్వర్​రెడ్డి అన్నారు.

Read More

కోదాడలో తొలి కరోనా

సారథిన్యూస్​, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్​లను […]

Read More

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లానాగారం మండలం ఫణిగిరి స్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నర్రా సందీప్, జేరిపోతుల హరీశ్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
TRAFFIC POLICE

డ్రైవర్​ ప్రాణం కాపాడిన పోలీస్​

సారథి న్యూస్ , నల్లగొండ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడో ట్రాఫిక్​ పోలీస్​.నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్​టవర్​ సెంటర్​లో హఫీజ్ ట్రాఫిక్​ పోలీస్​గా పనీచేస్తున్నాడు. బుధవారం ఓ వాహనదారుడు కారులో రాంగ్​రూట్​లో వస్తుండగా.. హఫీజ్​ అతడి కారును ఆపాడు. తాను చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవరుగా పని చేస్తున్నట్టు డ్రైవర్​ తెలిపాడు. హైదరాబాద్​ నుంచి నల్లగొండ వైపు వస్తుండగా.. చిట్యాలకు వచ్చినప్పటి నుంచి ఛాతిలో నొప్పి వస్తున్నదని.. […]

Read More

పనులు పూర్తయితేనే సంతకాలు పెట్టండి

సారథి న్యూస్​, నల్లగొండ: మిషన్ భగీరథ పనులు అసంపూర్ణంగా ఉన్నప్పుడు సర్పంచ్​లు పూర్తయినట్లు సంతకాలు పెట్టకూడదని మంత్రులు గుంటకండ్ల జగదీశ్వర్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మిషన్ భగీరథ పథకం పుట్టిందే మునుగోడులో పుట్టిన ఫ్లోరిన్ ను నిరోధించడం కోసమేనని అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 843 పంచాయతీలు 1,670 ఆవాస ప్రాంతాలతో పాటు 19 మున్సిపాలిటీలను కలుపుకుని మొత్తం 1,689 ఆవాసాల్లో మిషన్​ భగీరథ పథకం ద్వారా మంచి […]

Read More

డేంజరస్ సైకో అరెస్ట్

సారథి న్యూస్, నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలు, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. లైంగిక వాంఛలు తీర్చుకుంటోన్న మోస్ట్ డెంజరస్ సైకో అఖిల్ ను మంగళవారం అరెస్ట్ చేశారు నల్లగొండ షీ-టీమ్ పోలీసులు. రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియాలో యువతులు, మహిళలను లైంగికంగా కోరికలు తీర్చుకుంటున్నన్నట్లు విచారణలో వెల్లడించినట్లు నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితుడు అఖిల్ ఉచ్చులో పదుల సంఖ్యల పలువురు యువతులు, మహిళలు ఉన్నట్లు తేలడం గమనార్హం. సికింద్రాబాద్ లోని […]

Read More

మొక్కలను సిద్ధంచేయండి

సారథి న్యూస్​, మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం పంచాయితీ నర్సరీని ఆకస్మిక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్​ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ డాక్టర్​ పి.పెంటయ్య సోమవారం పరిశీలించారు. ఈనెల 20వ తేదీన ఉంచి హరితహారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధి హామీ మేటీలకు శిక్షణ ఇచ్చి కూలీలను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ కొండపల్లి విజయ, ఏపీవో శేఖర్ ఉన్నారు.

Read More