న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సాధించారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన ఖ్యాతిని గడించారు. వాజపేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2,268 రోజులు కొనసాగారు. కాగా, గురువారంతో ప్రధాని మోడీ ఆ రికార్డును అధిగమించారు. ఈ మేరకు బీజేపీ సోషల్‌మీడియా జాతీయవిభాగం ఇంచార్జి ప్రీతీ గాంధీ ట్వీట్ చేశారు. ఇక సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో మోదీ నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నదని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్నారు. శరీర అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని.. గుండె నుంచి శరీర భాగాలకు రక్త సరఫరా సాధారణంగానే ఉందని వివరించారు. ఇటీవల ఆయనకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా పైపైకి అందకుండాపోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,350 క్షీణించడంతో రూ. 54,680కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,010 తగ్గడంతో రూ.50,130కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.50 పెరగడంతో రూ.72,550కు చేరింది. ఇలా రెండు, మూడు రోజులుగా గోల్డ్ ధరలు […]
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే […]
వాషింగ్టన్: కమలా హ్యారిస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యరీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థికి ఎంపికైనా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు అభినందనలు తెలిపారు. ‘ కమలా హ్యారిస్ ఎంపిక అన్ని వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి, దక్షిణాసియా మహిళలకు గర్వకారణమని చెప్పుకోవచ్చు’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫోటోను షేర్ చేశారు.
న్యూఢిల్లీ: ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడం, హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వినిపించింది. తండ్రి జీవించి ఉన్నా.. లేకపోయినా ఆడపిల్లలకు మాత్రంలో ఆస్తిలో సమానహక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉంటుందని, దానిపై హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.చట్టం ఏం చెబుతోందిహిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలు చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60,963 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 56,110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడం ఊరట నిచ్చే అంశం. ఇప్పటివరకు 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 70.38 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 23,29,638 కి చేరుకున్నది. ఇప్పటివరకు 46,091మంది కోరోనా మృతిచెందగా.. 6,43,948 మంది వివిధ […]
వాషింగ్టన్: భారతసంతతికి చెందిన ఓ మహిళ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికే ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్‌గా ఉన్న కమలా హారీస్‌ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్ష పదవి కోసం నెలరోజుల పాటు కసరత్తు చేసి.. చివరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. కమలా […]