Breaking News

ఆధ్యాత్మికం

మూఢాల్లో ఏం చేయొద్దు

గురుగ్రహం లేదా శుక్ర గ్రహం కాని సూర్యుడితో కలసి ఉండే కాలాన్ని మౌఢ్యమి లేదా మూఢాలు అంటారు. మౌఢ్యకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించేందుకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభగ్రహమైన శుక్రుడికి మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం. మౌఢ్యమిని ‘మూఢమి’గా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యాలు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. […]

Read More

బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలి

బ్రహ్మముహూర్తం(బ్రాహ్మీ ముహూర్తం) చాలా విలువైన కాలం.. మన పూర్వీకులు కాలాన్ని ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియకు ప్రస్తుత మన కాలమానం ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా రెండు ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అన్నమాట. పగలు, రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అని పిలుస్తుంటారు. ఒక అహోరాత్రంకు సంబంధించి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయన్నట మాట. సూర్యోదయానికి ముందు వచ్చే […]

Read More

నమో ఆంజనేయం

భక్తుల కొంగు బంగారంగా సహకార ఆంజనేయ స్వామి పర్యాటకంగా అభివృద్ధిచెందుతున్న ఆలయం సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా గొట్టిముక్కుల పంచాయతీ చాకలిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దట్టమైన అరణ్యంలో కొలువైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. తూప్రాన్– నర్సాపూర్ మెయిన్​ రోడ్డుకు ఆనుకుని అరణ్యంలో కొలువైన సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తజనం వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతుండడంతో స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఉమ్మడి మెదక్​ […]

Read More

జైనుల నెలవు.. పార్శ్వీనాథుడి కొలువు

సారథి న్యూస్, మెదక్: జైనమతం గురించి ప్రస్తావనకు రాగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళా, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌‌.. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన జైన మందిరాలు కొలువై ఉన్నాయి. ఇపుడు మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ జైనమందిరం సైతం జైనులకు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. చారిత్రక నేపథ్యం 11వ శతాబ్దంలో ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలోని పలు ప్రాంతాలు కళ్యాణి చాళుక్యుల ఏలుబడిలో ఉండేదని చరిత్ర […]

Read More

జ్యేష్ఠం.. విశిష్టమాసం

చాంద్రమానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవసేవలో తరించేందుకు అవసరమైన కొన్ని పుణ్యతిథులు మనకు ఈ మాసంలోనే కనిపిస్తాయి.జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైందిగా చెబుతారు. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమపిండితో తయారుచేసి ఈ నెలరోజుల పాటు పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చని […]

Read More

ప్రకృతి రక్షణే పరమాత్మ పూజ

ననః పురో జనపదాన గ్రామాన గృహావయమ్నిత్యం వనౌకసస్తాత వనశైల నివాసినఃతస్మాద్గవాం బ్రాహ్మణానా మద్రేశ్చారభ్యతాం మఖః శ్రీమద్భాగవత పురాణంలో వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణుడి ముఖతఃనందుడితో చెప్పించిన మాటలివి.. నందగోకులంలో యజ్ఞసంరంభాలు ఆరంభమైన సందర్భంలో శ్రీకృష్ణుడు తన తండ్రి నందుడి వద్దకు వెళ్లి ఈ హడావుడి అంతా ఎందుకని అడిగాడట. దానికి ఆయన ఇంద్రుడి తృప్తి కోసం తాము చేయబోయే యాగం గురించి కృష్ణుడికి చెప్పాడట. ‘వర్షాధిపతియైున ఇంద్రుడు సంతసించి వర్షాలు కురిపించిన కారణంగా ప్రకృతి పులకించి పుష్కలంగా గడ్డి […]

Read More
శంకరం.. లోక శంకరం

శంకరం.. లోక శంకరం

‘శివతత్వమే మన తత్వమని, అదే మానవత్వం’ అని బోధించారు మహిమాన్విత మూర్తి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. హైందవ ధర్మాన్ని సంరక్షించుకునేందుకు జన్మించిన అపరశంకరులే ఈ భగవత్పాదువారు. భరతఖండం భిన్నకులాల సమాహారం. ఈ భిన్న కులాలను ఏకత్వం వైపు నడిపి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాపురుషుడు. హిందూధర్మానికి దశ, దిశ నిర్దేశించిన నిర్దేశకుడు ఆది శంకరాచార్యులవారు. ఆస్తికత్వాన్ని స్థాపించి హైందవం అనే మహావృక్షానికి జీవం పోసిన మహానుభావులు. ఇలాంటి అవతార పురుషులు అవతరించిన పుణ్యదినం ఏప్రిల్ 28న […]

Read More
మకరతోరణం.. విశేషం

మకరతోరణం.. విశేషం

ఆలయాల్లో దేవతా విగ్రహాల వెనక అమర్చిన తోరణ మధ్యభాగంలో కన్నుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసుడి ముఖం కనిపిస్తుంది. దీనికే ‘మకర తోరణం’అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చడానికి గల కారణాలను స్కంద మహాపురాణంలో ఓ కథ ఉంది.  పూర్వం ‘కీర్తిముఖుడు’ అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది.. తద్వారా వచ్చిన బలపరాక్రమంతో సమస్త భువనాల్లోని సకల సంపదలను సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుడి పత్ని అయిన ‘జగన్మాతను’ […]

Read More