Breaking News

మూఢాల్లో ఏం చేయొద్దు

గురుగ్రహం లేదా శుక్ర గ్రహం కాని సూర్యుడితో కలసి ఉండే కాలాన్ని మౌఢ్యమి లేదా మూఢాలు అంటారు. మౌఢ్యకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించేందుకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభగ్రహమైన శుక్రుడికి మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం. మౌఢ్యమిని ‘మూఢమి’గా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యాలు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు, శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటుపోటుల్లో మార్పులు వస్తాయి. శుక్ర గ్రహపాలిత ద్వీపాలు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితం, శృంగార జీవితానికి కారకుడు. జాతకాల్లో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణిదేవి స్తోత్రం పారాయణం చేయాలి
చేయకూడని పనులు
మౌఢ్యమిలో పెళ్లిచూపులు, వివాహం, ఉపనయనం, గృహ ఆరంభం, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుడం, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్ఠాపనలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, కొత్త వాహనం కొనడం, బావులు , బోరింగులు, చెరువులు తవ్వడం, పుట్టువెంట్రుకలు, వేదా విద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదని శాస్త్రం చెబుతోంది.
మౌఢ్యమిలో చేయదగిన పనులు
జాతకర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా, శుక్రమౌఢ్యమి వచ్చినా చేయొచ్చు. గర్భిణులు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితుల్లో మూఢాల్లో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిథుల్లో అశ్వని, రేవతి నక్షత్రాలు, శుభహోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.
:: దిండిగల్​ ఆనంద్​శర్మ
సెల్​ : 96660 06418