సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: న్యాయాన్ని గెలిపించాల్సిన న్యాయవాదులు రచ్చరెక్కారు. నల్లకోటుతో న్యాయదేవతను రక్షించాల్సిన కొందరు వకీల్ సాబ్ లు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన అమాయకపు ప్రజలను నిలువునా మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. తీరా తమ అవినీతి బాగోతాలు బయటికి రావడంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ రచ్చ రచ్చచేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన బార్ కౌన్సిల్ వాట్సాప్ గ్రూప్ లో ఒకరి […]
సామాజికసారథి, మహబూబ్నగర్: మాదిగలకు సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినా అమలు చేయకుండా ఉద్యోగాలను భర్తీచేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలుచేస్తామని చెప్పి, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు బెంచి తీర్పు చెప్పిందని వివరించారు. వర్గీకరణ అమలు చేయకుండా 11వేల టీచర్ఉద్యోగాలను భర్తీచేయడంతో మాదిగ బిడ్డలు 500కు పైగా […]
సామాజికసారథి, వనపర్తి: కంచే చేను మేసిందన్న చందంగా అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే అడ్డదారులకు సహకరిస్తుండటం వనపర్తి జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యాభివృద్దికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుండడాన్ని కొందరు విద్యాశాఖ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను సైతం ఇటీవల భర్తీ చేసింది. దీంతో కొత్త టీచర్లు జాయిన్ కావడం, మరికొందరు ప్రమోషన్లతో ఇతర స్కూళ్లకు వెళ్లిపోవడంతో జిల్లాలో అక్కడక్కడా […]