Breaking News

Year: 2023

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

  • March 16, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత అవినీతి వల్లే ఎంతో సమర్థవంతంగా నిర్వహించవలసిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు కావడంతో వేలాది మంది నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని అసమర్ధ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు . గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది […]

Read More

పిడుగు పడి యువకుడు మృతి

సామాజిక సారధి , బిజినపల్లి :పిడుగుపాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన లింగసాయింపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది .. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం బిజినపల్లి మండల పరిధిలోని లింగ సాయం పల్లి గ్రామానికి చెందిన మేకల బాలకృష్ణ (22) అనే యువకుడు రోజువారిగా గురువారం ఉదయం గొర్రెలను తీసుకొని మేత కొరకు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వెళ్ళాడు . ఒక్కసారిగా సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో గొర్రెలను […]

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ అందిస్తాం

….జర్నలిస్టులతో కలెక్టర్ ఉదయ్ కుమార్ సారథి , నాగర్ కర్నూలు: అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు అందిస్తామని, వివిధ కారణాలవల్ల దరఖాస్తు చేసుకొని వారికి మరొక అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం టియుడబ్ల్యూ-జేహెచ్143 జర్నలిస్టు సంఘం నాయకులు కలెక్టర్ ను కలిసిన సందర్భంగా కలెక్టర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర జిల్లాలలో ఇచ్చిన విధంగా పత్రికలు, న్యూస్ చానల్స్, ఫోటో,వీడియో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించాలని, […]

Read More

MLC Elections: 14 ఓట్లకు .. 21మంది సిబ్బందికి ఎన్నికల డ్యూటీ

సామాజికసారథి, నాగర్ ‌కర్నూల్ బ్యూరో: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యంత పకడ్బందీ మధ్య జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిఓటూ విలువైందే. అయితే జిల్లాలోని తిమ్మాజిపేట మండల పోలింగ్ కేంద్రంలో మొత్తం 14 ఓట్లకు 13 పోలయ్యాయి. 14 ఓట్లకు గాను స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి 21 మంది సిబ్బందిని నియమించారు. పాఠశాలకు కూడా సెలవిచ్చారు. టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తహసీల్దార్, పోలీసుశాఖ, వైద్యశాఖ అధికారులు పరిశీలించారు. […]

Read More

నన్నెవరు ఏమీ చేయలేరు…

-మినిష్టర్, కలెక్టర్ ఎవ్వరికన్నా చెప్పుకో….-వనపర్తి డీఈఓ గా నన్ను తీసేసే దమ్ము ఉందా…-రోజు ఇలాగే సర్కారు కారును వాడుకుంటా…-నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రాసి ఇవ్వాల్సీందేకారు ఓనర్ ను బెదిరిస్తున్న వనపర్తి డీఈఓ రవీందర్సోషల్ మీడియాలో స్టూడెంట్ యూనియన్ నేత, -కారు ఓనర్ కాల్ రికార్డింగ్ హల్ చల్ సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి జిల్లా డీఈఓ రవీందర్ సర్కారు కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకుంటూ కారు ఓనర్ ను వేదిస్తున్న విషయంపై శనివారం సామాజిక […]

Read More

సొమ్ము సర్కారుది….సోకు డీఈఓ ది..

సామాజిక సారథి,వనపర్తి: స్వంత పనులకు సర్కారు కారు ను వాడుకోవద్దన్న రూల్ వనపర్తి డీఈఓ రవీందర్ కు పట్టడం లేదు.వనపర్తి డీఈఓగా రవీందర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అవినీతి, ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. డీఈఓ గా వనపర్తి జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల ను విజిట్ చేయాల్సిన రవీందర్ సర్కారు స్కూళ్ల ను గాలికొదిలేశారు. తన సొంత గ్రామం మహబూబ్ నగర్ కావడంతో సర్కారు ఇచ్చిన […]

Read More

సర్పంచిని బెదిరించిన యువకుడి బైండోవర్

సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామ సర్పంచి సుదర్శన్ గౌడ్ ను అదే గ్రామానికి చెందిన యువకుడు వేముల సైదులు తప్ప తాగి ఫోన్ లో అసభ్య పదజాలంతో దూషించాడు. చంపివేస్తానని బెదిరించిన యువకుడిని సోమవారం పోలీసులు తహసీల్దార్ అంజిరెడ్డి ముందు బైండోవర్ చేశారు . మరోమారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అంజిరెడ్డి యువకుడిని హెచ్చరించారు . చాలామంది యువత ఉపాధి […]

Read More

రాయలగండిలో రాజకీయ రచ్చ

సామాజికసారథి, అచ్చంపేట: నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]

Read More