సామాజికసారథి, వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామానికి చెందిన బండ్ల శ్రీనివాస్ ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వెల్దండ మాజీ ఎంపీపీ పి.జయప్రకాశ్ అతని కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.ఐదువేల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. పేదకుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మృతుడు బండ్ల శ్రీనివాస్ పిల్లలకు గురుకులాల్లో మంచి విద్యను అందించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు జగదీశ్వర్, వినోద్ తో పాటు […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చల్లపల్లికి చెందిన పకాడి లక్ష్మయ్య, లక్ష్మమ్మ కూతురు స్రవంతి వివాహానికి శుక్రవారం మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాశ్(జేపీ)రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. పేదలకు తనవంతు సహాయం చేస్తూ ఎళ్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కాగా, లక్ష్మయ్య గతంలోనే చనిపోవడంతో రెక్కలకష్టంపై లక్ష్మమ్మ తన కూతురును చదివించి పెళ్లిచేస్తోంది. మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాశ్ సాయం చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనను […]
‘మల్లు ఫ్యామిలీ’ మాదిగలకు ముల్లులా తయారైంది కాంగ్రెస్ నేత సతీశ్మాదిగ హాట్ కామెంట్స్ సామాజికసారథి, మహేశ్వరం: కాంగ్రెస్‌పార్టీలో మాల సామాజికవర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్‌నేత దేవని సతీశ్మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గాంధీభవన్ముందు కాంగ్రెస్‌పార్టీ మాదిగల ఆవేదన దండోరా కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీల కమిటీల్లో మాదిగలకు స్థానం కల్పించాలని కోరారు. కమిటీల్లో అన్యాయం చేస్తున్నారని, మాలలే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం […]
మొదటి విడత 300 కుటుంబాల ఎంపిక 90శాతం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణలు ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదు ‘సామాజికసారథి ప్రతినిధి’తో నాగర్ కర్నూల్జిల్లా కలెక్టర్పి.ఉదయ్ కుమార్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్పి.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 300 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో […]
సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నిత్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం. జిల్లాకు సంబంధించిన పాలనా అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ పాలన సాగించే ప్రాంగణం.. తుపాకీతో సినిమాలో హీరో లెవల్ లో గురిపెడుతూ సెల్‌ఫోన్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇది చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. పైగా ఈ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇది ఎక్కడో కాదు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ఘటన […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ […]
మా కూతురుకు ఏమైందో చెప్పండి మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన కలెక్టర్, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు సామాజికసారథి, మహబూబ్‌నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన కోటిచింతల నిరంజన్‌రావు స్మారకార్థం ఆయన సతీమణి సుగణమ్మ, కుమారుడు పురుషోత్తంరావు రూ.51,116ను విరాళంగా అందజేశారు. ఆభయ ఆంజనేయుడి సన్నిధిలో ఆ మొత్తాన్ని వారు గ్రామసర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని పనులు పూర్తయితే త్వరలోనే పూర్తిచేసుకుందామని చెప్పారు. గొప్ప […]