ఆలయాలకు పోటెత్తిన భక్తులు న్యూ ఇయర్ వేళ ఘనంగా పూజలు కోరికలు నెరవేరాలని ప్రత్యేక మొక్కులు సామాజికసారథి, హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 2022లో మంచి జరగాలని విశేషపూజలు నిర్వహించారు. కొంతమంది తమ మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లాపాపలతో తరలివచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని బిర్లామందిర్‌కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారంతా స్వామిని దర్శించుకుని […]
అనేక రోడ్లకు నిధులు మంజూరు చేయించాం షేక్ పేట్ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షేక్ పేట్ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, ఇక్కడికి […]
బిజినేపల్లి మండలంలో జోరుగా పేకాట మహబూబ్‌నగర్‌కు మారిన మకాం తాజాగా పట్టుబడిన కొందరు అధికారపార్టీ నేతలు నిందితుల నుంచి రూ.8.92లక్షలు స్వాధీనం స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినేపల్లి మండలం కొంతమంది పలుకుబడి కలిగిన నేతలు, రియల్టర్లు, డ్రగ్స్, ఇసుక వ్యాపారులకు పేకాట అడ్డాగా మారింది. సామాన్యులపై ప్రతాపం చూపించే నాయకులు వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాకు కొంతమంది […]
పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్: బైక్ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్ ఖేడ్ మండలం మంగల్ పేట్ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్ పల్లి సమీపంలో రాంగ్ రూట్‌లో వెళుతుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంక్ […]
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ సామాజిక సారథి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ చేసిన అప్పులు తీర్చాలంటే పదేళ్లయినా సరిపోవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల దీక్షకు సోమవారం వారు మద్దతు తెలిపి మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీనిచ్చి పనులు ప్రారంభించాలన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు కట్టించినట్లే, నిర్వాసితుల […]
రేపటి పౌరుల భవిష్యత్ కు మప్పు నల్లగొండలో చిన్నారులను ఎత్తుకుని భిక్షాటన నిద్రపోవడానికి మత్తు మందు ఇస్తున్నట్లు ఆరోపణ సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: చూడటానికి జిల్లాకేంద్రం. ఎప్పుడు చూసినా అధికారులు, పోలీసులు, రాష్ట్ర స్థాయి అధికార పార్టీ నేతలు రయ్ రయ్ మంటూ వెళుతుంటారు. ప్రధాన కూడళ్లలో చిన్నపిల్లల్ని సాకుగా చూపించి భిక్షాటన చేసే మహిళలే వారికి కళ్లకు కనిపించరు. చూడటానికి పేద మహిళే అయినా, వారి చేతిలో రేపటి పౌరుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. […]
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సామాజిక సారథి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను చూస్తే ఎందుకు భయపడుతున్నారని అధికార పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీసులను సొంత ఆర్మీలా వాడుకుంటున్నారని ఆరోపించారు.పోలీసుల ద్వారా ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని […]