Breaking News

Month: January 2022

హస్తం గూటికి డీఎస్

హస్తం గూటికి డీఎస్​

  • January 17, 2022
  • Comments Off on హస్తం గూటికి డీఎస్​

కాంగ్రెస్​లోకి సీనియర్​ నేత జనవరి 24న ముహూర్తం సోనియగాంధీ సమక్షంలో చేరిక సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరనున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఆయన కాంగ్రెస్​లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేగాకుండా ఆయన ఢిల్లీకి వెళ్లి హస్తం పార్టీ పెద్దలతో సమాలోచనలు కూడా జరిపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన […]

Read More
ఒమిక్రాన్ఎఫెక్ట్

ఒమిక్రాన్​ఎఫెక్ట్​

చిన్నారులపై ప్రభావం నిర్లక్ష్యమే కారణం జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్​కూడా విస్తృతంగా లేకపోవడంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా […]

Read More
జనగామ ఎమ్మెల్యేకు కరోనా

జనగామ ఎమ్మెల్యేకు కరోనా

సామాజిక సారథి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా మొదటి వేవ్ లో కూడా ముత్తిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సతీమణి, గన్ మెన్, వంటమనిషి, డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు.

Read More
30 దాకా సెలవులు

30 దాకా సెలవులు

కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్​ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థలకు పొడిగింపు మెడికల్​కాలేజీలకు మినహాయింపు సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్​ పిల్లల చదువులపై పేరెంట్స్​ఆందోళన సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్​కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ […]

Read More
భక్తి పారవశ్యంతో మల్లన్న బ్రహ్మోత్సవాలు

భక్తి పారవశ్యంతో మల్లన్న బ్రహ్మోత్సవాలు

  • January 17, 2022
  • Comments Off on భక్తి పారవశ్యంతో మల్లన్న బ్రహ్మోత్సవాలు

సామాజికసారథి, సిద్దిపేట: మల్లన్న మాడ వీధులు భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా అంతా పసుపుబండారు మయంగా మారింది. శివసత్తుల సిగాలు, డమరుక నాథాలు పోతారాజుల విన్యాసాలు, డోలు చప్పుళ్లతో మల్లన్న ఆలయానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. శనివారం వేకువజామునుంచి ఆదివారం రాత్రి వరకూ సుమారు 50యాభైవేల మంది దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో ఐదు గంటల సమయం పట్టింది. అనంతరం కొండ పైన […]

Read More
గుట్కా ఫ్యాకెట్ల ముఠా అరెస్ట్

గుట్కా ఫ్యాకెట్ల ముఠా అరెస్ట్

  • January 17, 2022
  • Comments Off on గుట్కా ఫ్యాకెట్ల ముఠా అరెస్ట్

జహీరాబాద్ లో రూ. 2 లక్షలు, ఆలుబాకలో 1.28 లక్షల గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం సామాజిక సారథి, వెంకటాపురం/ జహీరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాకలో ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో రూ.1.28 లక్షల విలువ గల గుట్కా ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ తిరుపతి తన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా చర్ల వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న టాటా మ్యాజిక్, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేయడంతో అందులో ప్రభుత్వం నిషేధిత […]

Read More
ప్రజా ప్రతినిధులకు కరోనా..

ప్రజా ప్రతినిధులకు కరోనా..

స్పీకర్​పోచారం, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలకు కరోనా పాజిటివ్​ సామాజిక సారథి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాటిజివ్‌గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ […]

Read More
విలువలు కాపాడిన వ్యక్తుల్లో జైపాల్ రెడ్డి ఒకరు

విలువలు కాపాడిన వ్యక్తుల్లో జైపాల్ రెడ్డి ఒకరు

  • January 17, 2022
  • Comments Off on విలువలు కాపాడిన వ్యక్తుల్లో జైపాల్ రెడ్డి ఒకరు

టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిదని : వీహెచ్ సామాజిక సారథి, హైదరాబాద్ : రాజకీయ విలువలు కాపాడిన వ్యక్తుల్లో ఎస్ జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు ఆయన తీసుకున్నారని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దంపతులు జైపాల్​రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి […]

Read More