Breaking News

‘పాస్ ఉంటేనే యూనివర్సిటీల్లోకి అనుమతి’పై ఆర్ఎస్పీ కామెంట్స్​

‘పాస్ ఉంటేనే యూనివర్సిటీల్లోకి అనుమతి’పై ఆర్ఎస్పీ కామెంట్స్​

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: పాస్​లు ఉంటేనే ఇతరులను విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నియంతల మాదిరిగా వ్యవహరించవద్దని హితవు పలికారు.
‘‘కొన్నిరోజుల క్రితం నేను విద్యార్థి,నిరుద్యోగుల సమస్యను అర్థంచేసుకుందామని చిక్కడపల్లి, ఓయూ లైబ్రరీలకు పోయి విద్యార్థులతో మాట్లాడిన(రాజకీయం కోసం కాదు). అంతే! ఇప్పుడు పాస్ ఉంటేనే ‘ఇతరులు’ లోపలకు రావాలని నాటి ఆంధ్ర నియంత పాలకుల్లాగా నేడు కేసీఆర్​ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది.’’అంటూ తాజాగా డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ట్విటర్ లో ట్విట్​చేశారు. ‘మొత్తం మీద కేసీఆర్ గారిలో భయం అనే ఒక ఆందోళన మొదలైంది. ఆర్ఎస్పీ గారిని చూసి. మీరు ఈ ఏడేళ్లలో నిజంగా సుపరిపాలన అందించి ఉంటే మా ఆర్ఎస్పీ గారి విసిటింగ్ లు చూసి ఆందోళన చెందాల్సిన పనిలేకుండే’ అని ఆయనకు సపోర్టుగా నెటిజన్లు ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నారు.