సామాజిక సారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజాహెగ్డే స్వీకరించి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజాహెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ […]
సామాజిక సారథి, హలియా: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ శుక్రవారం హైదరాబాధ్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కలిసి డిసెంబర్ 01 ప్రథమ వర్ధంతి, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, నోముల నర్సింహయ్య యాదవ్ ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ సామాజిక సారథి, సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండువేలకోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ.20వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన సతీమణిని ఎమ్మెల్సీ ఎన్నికల పోటీనుంచి విత్ డ్రా చేయిస్తానని హరీశ్‌రావుకు ఛాలెంజ్ విసిరారు. నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు రూ.20వేల కోట్లు […]
సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక సారథి డిండి: ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపురంలో సీపీఐ నూతన జెండా ఆవిష్కరణతో పాటు జోగు బజార్ 12 వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బజార్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎండి మైన్ఉద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, […]
సామాజిక సారథి, హాలియా: విదేశాలలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఖతర్ దేశంలోని దోహా నగరంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్బగౌని శ్రీధర్ అధ్యక్షతన దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖతార్ కార్యవర్గ సభ్యులు సుందరగిరి శంకర్, తాళ్ల పెళ్లి ఎల్లయ్య,కుంబాజి సాయి తేజ, మాసం రాజిరెడ్డి,శంకరాచారి, ప్రవీణ్,నర్సయ్య,భాస్కర్ గౌడ్, ఎండి సుభాని తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వలిగొండ: డిసెంబర్ 5,6,7 తేదీల్లో పోచంపల్లిలో నిర్వహించనున్న సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. శుక్రవారం సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, దీర్ఘకాలిక సమస్యలపై పోరాటాలు నడిపి వాటి పరిష్కారానికి మార్గం చూపిందని, రాష్ట్రం ఏర్పడి జిల్లాలు ఏర్పడిన ప్రజల అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. […]
సామాజిక సారథి, వలిగొండ: గర్భిణీ స్త్రీలు నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు 180 ఐరన్ మాత్రలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సర్పంచ్ లు బొల్ల లలిత శ్రీనివాస్, చేగూరి భిక్షపతి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంతో పాటు టేకులసోమారం అంగన్ వాడీ కేంద్రాలలో బాలింతలకు పౌష్టికాహారం, పరిపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, అంగన్వాడీ టీచర్ లు బి. సోమేశ్వరి, కె దుర్గ, ఆశా వర్కర్ వసంత, […]