సామాజిక సారథి, అచ్చంపేట: అప్పులబాధలతో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి తండా మహిళా సర్పంచ్ భర్త రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. తండాలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు పనులు చేసి అప్పుల పాలయ్యాడు. అందుకోసం సుమారు రూ.8లక్షల అప్పుచేశాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. చేసిన పనులకు బిల్లులకు రాకపోవడం, అప్పులు ఇచ్చినవారు డబ్బులు ఇవ్వమని వారు బలవంతం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి […]
సామాజిక సారథి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. విద్యానగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు చౌటి ప్రభాకర్, అనిల్ తదితరులు ఉన్నారు.
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న వినాయకచవితి పండుగను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, అందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. […]
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషిచేయాలని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల పౌరులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రైతుబంధు అధ్యక్షుడు […]
సామాజిక సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కురుమ సంఘం మహిళా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాధ్యక్షురాలిగా వేముండ్ల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పెద్దిగారి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. కురుమ కులస్తులు ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య, జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప, ఉపాధ్యక్షురాలు పెద్ది అనిత, కడారి వీరయ్య, […]
సీఎం కేసీఆర్ ఉగాది పురస్కారంలో గుర్తింపునిచ్చారు కిన్నెరమెట్ల కళ నాతోనే ముగియకుండా నేర్పిస్తా ప్రభుత్వం కొంత భూమి ఇచ్చి ఆదుకోవాలి కిన్నెరమెట్ల ప్రముఖ కళాకారుడు మొగులయ్య సామాజిక సారథి, అచ్చంపేట: ‘సీఎం కేసీఆర్ నాకు గుర్తింపు ఇచ్చిండు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్, నా కుటుంబానికి ఆధారమని 12 మెట్ల కిన్నెర ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య తెలిపారు. సినిమా నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లానాయక్’ సినిమాలో పాట పాడే అరుదైన అవకాశం తనకు […]
సామాజిక సారథి, చొప్పదండి: లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పలువురు ఉత్తమ సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మలుమాచు సుధాకర్, సెక్రటరీ రాజేష్ పవార్, చీఫ్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కొల్లూరి ఆనందం, మోర బద్రేశం, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ వల్లాల కృష్ణ, హరి, సభ్యులు బత్తుల భూమయ్య, పచునూరి తిరుపతి, పెద్దిలక్ష్మీకాంతం, తాటికొండ శ్రీనివాస్, చింతల రవి, దూస […]
‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా హీరోగా మాత్రం మంచి గుర్తింపే వచ్చింది ఆకాష్ కు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆకాష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు పూరీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి […]