Breaking News

Day: July 14, 2021

జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి

జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి

సారథి, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మొదటి కుమారుడు రాధాకృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్మారకార్థం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, కేశంపేట, కొత్తూరు, […]

Read More
18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్​టెస్ట్​

18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్ ​టెస్ట్​

సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్‌ సర్వీస్ నుంచి గాని డౌన్​లోడ్​చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల […]

Read More
రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ

రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ

సారథి, బిజినేపల్లి: వాతావరణ మార్పులకు అనుసంధానంగా స్థిరస్థాపక కుటుంబాల అభివృద్ధి(ఆర్​ఏహెచ్​యాక్ట్​) అనే పథకం ద్వారా నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్, లట్టుపల్లి, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలకు చెందిన 231 మంది రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ చేశారు. వర్షాధారంగా రైతులకు ఎకరానికి సరిపడా ఒక పత్తి ప్యాకెట్ రెండు కేజీల కంది విత్తనాలు (4:1) నిష్పత్తిలో అంతరపంటగా వేసేందుకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల రైతు […]

Read More
పాస్పోబ్యాక్టీరియాపై రైతులకు అవగాహన

పాస్పోబ్యాక్టీరియాపై రైతులకు అవగాహన

సారథి, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల వ్యవసాయాధికారి సతీష్ ఆధ్వర్యంలో క్షేత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతుక్షేత్రంలో నారుమడి దశలో పాస్పోబ్యాక్టీరియా వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా దుక్కిలో వేసే డీఏపీ, 20-20-0-13 వంటి ఎరువులు మోతాదుకు మించి వాడడం ద్వారా ఖర్చు పెరుగుతుందని, భూమి, వాతావరణ కాలుష్యం, పంటలకు జింకు లోపం ఏర్పడుతుందన్నారు. పాస్పో బ్యాక్టీరియా ద్రావణాన్ని 500 మి.లీ చిన్న గుంతలు పోసి ఆ నీటిలో వరి నారును […]

Read More
‘కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్​కోవర్టు’

‘కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్​ కోవర్టు’

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో డీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను దూషించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డిది కాదన్నారు. వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తొత్తుగా మారి మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులను […]

Read More
భూకబ్జాల చరిత్ర మీదే

భూకబ్జాల చరిత్ర మీదే

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని […]

Read More