Breaking News

Month: June 2021

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

సారథి, కోడేరు: నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.

Read More
కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

సారథి, రామాయంపేట: భూమి కోసం భార్యతో కలిసి కొడుకు వేధించడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మెదక్​జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో వెలుగుచూసింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరున ఉన్న 2.10 ఎకరాల భూమిలో పెద్దకొడుకు నర్సింలు భార్య సంపూర్ణపై 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. ఈ క్రమంలో చిన్నకొడుకు శ్రీనివాస్ తన తండ్రిని నమ్మించి తన భార్య పేరు మీద […]

Read More
‘నల్లమట్టిని తరలిస్తున్న ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి’

‘నల్లమట్టిని తరలిస్తున్న ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి’

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామ శివారులోని భీమ సముద్రం(చెరువు)లోని నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్న వట్టెం రిజర్వాయర్ హెచ్​ఈసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పలువురు రైతులు బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని, అభ్యంతరం చెబుతున్న రైతులపై దౌర్జన్యానికి దిగుతున్నారని అందులో పేర్కొన్నారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. వినతిపత్రం అందజేసినవారిలో పోట్టాల బాబు, డొక్కా చెన్నయ్య, మ్యాతరి […]

Read More
నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

సారథి, పెద్దశంకరంపేట: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ హెచ్చరించారు. మంగళవారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తీసుకున్న విత్తనాలను పరిశీలించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నాసిరకం విత్తనాలను అంటగడితే తమకు సమాచార ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
రాజన్న సన్నిధిలో మాజీ ఎంపీ పొన్నం

రాజన్న సన్నిధిలో మాజీ ఎంపీ పొన్నం

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మంగళవారం స్వామివారిని కరీంనగర్​ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. పొన్నం వెంట పలువురు కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

సారథి ప్రతినిధి, జగిత్యాల: కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి హెచ్ సీఏలో ఆరుగురు సభ్యులను అధ్యక్షుడు మహమద్ అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ ‌క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన ‌జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్ సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువక్రీడాకారులను ప్రోత్సాహించనుంది. అందులో భాగంగా పలు కొత్త జిల్లాలకు సభ్యత్వం కల్పించారు. జిల్లా ‌కోటాలో వాల శరత్ చంద్ర, […]

Read More
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సారథి, రామడుగు: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నరాజ మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట బాపిరాజు, రామడుగు గ్రామాధ్యక్షుడు సముద్రాల […]

Read More
‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Read More