Breaking News

Day: June 26, 2021

రాములపల్లిలో పల్లెనిద్ర

శ్రీరాములపల్లిలో పల్లెనిద్ర

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం మండల అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పలు వార్డుల్లో కలియ తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్థానికులు పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ జీవన్, ఎంపీడీవో మల్హోత్రా, ఎంపీవో సతీష్, కార్యదర్శి శ్రీకాంత్ రావు, ఎంపీటీసీ సభ్యుడు మోడీ రవి, ఏఎన్ఎం, వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు

ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు

సారథి, రామడుగు: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గ సమస్యలను వదిలి హుజురాబాద్ లో ప్రచారం చేయడం ఏమిటని కాంగ్రెస్ ఇన్​చార్జ్​మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలో పలు తూముల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రూ.165కోట్ల వ్యయంతో తూములు నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నా రెండు రూపాయల పనిచేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో యావత్ తెలంగాణకు నీటిని తీసుకుపోవడం బాగానే ఉన్నా […]

Read More
రేవంత్​రెడ్డికే పీసీసీ పగ్గాలు

రేవంత్​రెడ్డికే టీపీసీసీ పగ్గాలు

సారథి, హైదరాబాద్: ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. అందరి అంచనాలు నిజమే అయ్యాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్​సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ఉత్తర్వులు జారీచేశారు. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పదిమందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించారు. వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్‌గౌడ్‌, గీతారెడ్డి, అజారుద్దీన్‌, అంజన్‌కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, కొల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్, కుమార్‌రావు, […]

Read More
ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్​ నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి నిరూపించారని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]

Read More
ఏపీ జలదోపిడీపై ఊరుకునేదే లేదు

ఏపీ జలదోపిడీపై ఊరుకునేదే లేదు

సారథి, అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఊరుకునేది లేదని, జలదోపిడీపై అక్కడే పాతరేస్తామని నాగర్ కర్నూల్​జిల్లా అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రియ నాయక్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ సైంధవపాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రప్రభుత్వం చోద్యం […]

Read More
23 కేజీల గంజాయి స్వాధీనం

గంజాయి గుట్టురట్టు

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 23 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ తన సిబ్బందిపై శనివారం అజిత్​బాషా ఇంటిపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గతకొద్దిరోజులుగా గంజాయికి అలవాటుపడ్డ కొందరు యువకులు విచ్చలవిడిగా తాగుతూ ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా వారిపై నిఘా ఉంచి గంజాయిని విక్రయిస్తున్న వారిని పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read More