Breaking News

Day: May 8, 2021

బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం

బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం

సారథి, రాయికల్: ఆపద సమయంలో ఓ యువకుడు గొప్ప మనస్సు చాటాడు. రక్తదానం చేసి మానవతను చూపాడు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కంచి సాయన్నకు అత్యవసరంగా ‘ఏ’పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దావన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు చెలిమెల మల్లేశంను సంప్రదించాడు. సదరు యువకుడు మానవత్వంతో స్పందించి జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు తాను 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పాడు. ఈ […]

Read More
అభ్యుదయ రైతు భాను

అభ్యుదయ రైతు భాను

వ్యవసాయం తెలియని శ్రీమంతుడు ఎకరాకు 90 బస్తాలు వరి ధాన్యం దిగుబడి సారథి, రామడుగు: ఆయనకు వ్యవసాయమంటే పెద్దగా తెలియదు. సాగు పద్ధతులు అంతకన్నా రావు. కనీసం సాగులో అనుభవం తనకు అనుభవం లేకున్నా తలపండిన రైతులను సైతం అధిగమించి పంట అధిక దిగుబడి సాధించాడు. దీంతో అందరిచేత శ్రీమంతుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన పంజాల భానుచందర్ గౌడ్ అనే యువరైతు నూతనంగా వ్యవసాయం ప్రారంభించారు. తనకు ఉన్న వ్యవసాయ […]

Read More
భీమవరంలో పుట్ట మధు అరెస్ట్​

భీమవరంలో పుట్ట మధు అరెస్ట్​

సారథి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధునుపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు శనివారం అరెస్ట్ ​చేశారు. కొద్దిరోజులుగా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారని సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్ట మధుపైనా సీఎం కేసిఆర్ తీవ్ర […]

Read More
అనవసర వివాదాల్లో తలదూర్చకండి

అనవసర వివాదాల్లో తలదూర్చకండి

నేటి రాశిఫలాలు8 మే 2021శనివారం మేషం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఇంటాబయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదావేయడం మంచిది కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృషభం: కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. […]

Read More
పచ్చిరొట్ట ఎరువులను వాడండి

పచ్చిరొట్ట ఎరువులను వాడండి

సారథి, రామాయంపేట: పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా భూసారం పెరుగుతుందని రామయంపేట ఏడీఏ వసంత సుగుణ అన్నారు. శుక్రవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులు నిజాంపేట ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంలో 65శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు 150 బస్తాలు, జనుము 112 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులంతా సద్వినియోగం ఆమె కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, ఏఈవోలు గణేష్ కుమార్, […]

Read More
భక్తి టీవీ పంచాంగం ఆవిష్కరణ

భక్తి టీవీ పంచాంగం ఆవిష్కరణ

సారథి, ములుగు: ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ఆలిండియా మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క ఎన్ టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ పంచాంగం బుక్ ఆవిష్కరించారు. భక్తిటీవీ మున్ముందు మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్​ రిపోర్టర్ అరుణ్ కుమార్, ములుగు రిపోర్టర్ సంపత్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లాల కుమారస్వామి. కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు బానోత్ చందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పేదలు ఆర్థికంగా ఎదగాలి

సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మండలంలోని జీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి రూ.60వేలు, టెంకటి గ్రామానికి చెందిన సావిత్రికి రూ.35వేల చెక్కును ఆయన అందజేశారు. ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

సారథి, పెద్దశంకరంపేట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దశంకరంపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ రాజు, .ఎంపీటీసీలు వీణాసుభాష్ గౌడ్, స్వప్నరాజేష్, దామోదర్, సర్పంచ్​లు నాయకులు ప్రకాష్, నరేష్, అశోక్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

Read More