Breaking News

అనవసర వివాదాల్లో తలదూర్చకండి

అనవసర వివాదాల్లో తలదూర్చకండి

నేటి రాశిఫలాలు
8 మే 2021
శనివారం

మేషం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఇంటాబయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదావేయడం మంచిది కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.

వృషభం: కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యల నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలుచేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతాయి. మిత్రులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం.

మిథునం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగంలో అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల చాలా ముఖ్యం. అనవసర వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.

కర్కాటకం: ఇంటాబయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలను గుర్తుచేసుకుని బాధపడతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలను కొంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దూరప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగం చేసే చోట అస్థిరత నెలకొని ఉంటుంది. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయాల్సి వస్తుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.

సింహం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండిబకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. విద్యార్థులకు ఆశించిన కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.

కన్య: వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాల్లో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు.

తుల: ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఎన్ని అవరోధాలు తలెత్తినా వ్యాపారరంగంలో వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది. స్త్రీలు ఆదాయంపై ధన సంపాదనపై మరింత దృష్టిపెడతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం కాగలవు.

వృశ్చికం: ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మార్కెటింగ్, ప్రైవేట్​ సంస్థల్లోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో నష్టాలు భర్తీఅవుతాయి. ఉద్యోగాల్లో సమస్యల నుంచి బయటపడతారు. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

ధనుస్సు: రుణదాతల ఒత్తిడి నుంచి బయటపడటానికి కొత్త రుణాలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు మార్పులకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో ధన నష్టాలుంటాయి. రావలసిన ధనం కొంత ముందు వెనుకనైనాఅందడం వల్ల ఆర్థిక ఇబ్బంది ఉండదు. బంధువులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరం: కీలక వ్యవహారాల్లో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికంగా ఉంటారని గమనించండి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మార్కెటింగ్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. రుణం కొంతమొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కుంభం: ఆకస్మిక ధనవ్యయం సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. చేతి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. రుణప్రయత్నాలు కలసిరావు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది.

మీనం: తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివితేటలతో ముందుకుసాగి జయం పొందండి. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యాఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగ, రుణయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.


:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్ ​నం.95020 59649