Breaking News

Day: April 7, 2021

హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

సారథి, గజ్వేల్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేయాలనే తలంపులతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాచరణ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మెడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరాయి. మంగళవారం కొండపోచమ్మ సాగర్ నీళ్లను మొదట హల్దివాగులోకి విడుదల చేశారు. మంజీరా నది ద్వారా నిజాంసాగర్ కు తరలించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ […]

Read More
ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

సారథి, రామాయంపేట/పెద్దశంకరంపేట/రామగుండం: జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అని నిజంపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు కొనియాడారు. సోమవారం బాబు జగ్జీవన్ రాం 114వ జయంతిని పురస్కరించుకుని మండలకేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గెరిగంటి లక్ష్మీ నర్సింలు, చల్మేడ ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, నందిగామ మాజీ […]

Read More
కరెంట్​ షాక్​తో మహిళ మృతి

కరెంట్​ షాక్​తో మహిళ మృతి

మృతురాలు రాజస్థాన్​ వాసి సారథి: పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్దశంకరంపేట ప్రియాంకకాలనీలో విద్యుదాఘాతంతో ప్రజాపతి కేసరి (22)అనే మహిళ చనిపోయింది. ఇంట్లో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. భర్త వినోద్ కుమార్ తో పాటు ఆమె రాజస్థాన్ నుంచి జీవనోపాధికి పెద్దశంకరంపేట వచ్చిన ఈ కుటుంబం ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఐస్ క్రీమ్ తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ప్రజాపతి కేసరి […]

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి, రామాయంపేట: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో కులవృత్తులను రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, రజక, నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లు మాఫీ చేయడం పట్ల రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి హర్షం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దోభీఘాట్లకు, లాండ్రీ షాప్, సెలూన్ షాపులకు 250 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు మాఫీచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్​ […]

Read More
పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

సారథి, రామడుగు: నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు మండలంలోని వెదిర, దేశరాజ్ పల్లి గ్రామాల్లో ఎండిన పంట పొలాలను స్థానిక సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వెదిరలో రామారావు అనే రైతుకు చెందిన మూడెకరాల పొలం ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని, ఎంతో శ్రమటోడ్చి పంట వేస్తే ఇలాంటి దుస్థితి వచ్చిందన్నారు. పంటలు ఎండిపోయినా, […]

Read More
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బీజేపీ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బీజేపీ

సారథి, రామడుగు: దేశ సంస్కృతి సంప్రదాయాలకు బీజేపీ ప్రతీక అని రామడుగు పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగరవేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో కాషాయ జెండా ఎగరడం కాయమన్నారు. కార్యక్రమంలో కారుపాకల అంజి, సంటి జితేందర్, కొలపురి రమేష్, జిట్టవేని అంజిబాబు, దురుశెట్టి రమేష్, రాంలక్ష్మణ్, మాడిశెట్టి అనిల్, రాగం కనకయ్య, నీలం లక్ష్మీరాజాం, పరశురాం, అంజి పాల్గొన్నారు.

Read More
కష్టకాలంలో రైతులను ఆదుకుంటాం

కష్టకాలంలో రైతులను ఆదుకుంటాం

సారథి, ములుగు: ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తాము పండించిన పంటను అమ్మడంలో ఇబ్బందిపడకూడదని ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్వోఎఫ్ఆర్ లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ములుగు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. […]

Read More
పోలీసుల విస్తృత తనిఖీలు

పోలీసుల విస్తృత తనిఖీలు

సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏటూరునాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతీ ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఎస్సై తిరుపతి నేతృత్వంలో మండలంలోని బర్లగూడెం గ్రామ సమీపంలో […]

Read More