Breaking News

Day: April 2, 2021

4న ‘స్వర సునామీ’ని సక్సెస్​చేయండి

4న ‘స్వర సునామీ’ని సక్సెస్​ చేయండి

సారథి, హైదరాబాద్​: ప్రతిష్టాత్మక భీం దీక్ష కార్యక్రమంలో ఏప్రిల్​ 4న కులీ కుతుబ్ షా స్టేడియంలో నిర్వహించే స్వేరో స్వర సునామీ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. ముఖ్య​అతిథిగా స్వేరోస్​ నెట్​ వర్క్​ చైర్మన్​, ఫౌండర్​, గురుకులాల సెక్రటరీ డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ హాజరవుతున్నారని తెలిపారు. ఈ మేరకు వారు మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహదూర్ పురా సర్కిల్ ఇన్​స్పెక్టర్​ డి.దుర్గాప్రసాద్, మలక్​పేట ఎమ్మెల్యే […]

Read More
లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం

లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం

సారథి, రామగుండం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఎన్టీపీసీ ప్లాంట్ గేట్నం.2 వద్ద సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. కార్మిక సంఘాల నేతలు మేరుగు రాజయ్య, ఎం.సారయ్య, మెండె శ్రీనివాస్, సీహెచ్​ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేశ్, కారం సత్తయ్య, వంగల రామన్న, కె.కృష్ణ, సీహెచ్​లక్ష్మణ్, నంది […]

Read More
వ‌ర‌ద‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

వ‌ర‌ద‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

సార‌థి, హైద‌రాబాద్‌: వ‌ర‌ద‌ నీటితో ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా స‌మస్యకు శాశ్వత ప‌రిష్కారం చూపుతూ ప‌నులు చేప‌డుతున్నామ‌ని ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయ‌న ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హయత్ నగర్ డివిజన్ లోని ఆంధ్రకేసరి నగర్ రోడ్డు నం.1లో రూ.75 లక్షలతో, బీజేఆర్ కాలనీ నుంచి జీహెచ్ఎంసీ లిమిట్స్ వరకు రూ.58.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ […]

Read More
మహనీయుల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

మహనీయుల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

సారథి, రామగుండం ప్రతినిధి: ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు ఉత్సవాల కమిటీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రాం, 11న మహాత్మా జ్యోతిరావుపూలే, 14న భారతరత్న డాక్టర్​బీఆర్​బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాలకు కలర్లు వేయించి, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇరుకుల్ల రాజనరసయ్య, జనరల్ సెక్రటరీ […]

Read More
క్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలతో మానసిక ఉల్లాసం

సారథి, రామడుగు: క్రీడలు మానసిక వికాస అభివృద్ధికి తోడ్పడుతాయని సర్పంచ్ పంజాల ప్రమీల అన్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గడికోట క్రీడామైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ గురువారం నిర్వహించారు. క్రీడలు వ్యక్తి మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, కార్యదర్శి మధుసూదన్, మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్, మాజీవార్డు సభ్యులు ఐతరవేని […]

Read More
బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

సారథి, రామడుగు: సమగ్ర బాలల సంరక్షణ పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం మండలంలోని వెదిర గ్రామంలో గురువారం గ్రామస్థాయి బాలాల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందులో మొత్తం 16 మంది సభ్యులు వీరిలో సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్​ అధికారి కవిత, సర్పంచ్ తీగల సంగీత, వార్డు సభ్యులు, కార్యదర్శి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ కమల […]

Read More
తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

సారథి, అయిజ(మానవపాడు): అయిజ మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ నిర్వహించే వ్యాపారులు అధికార బలంతో చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయల తై బజార్ లో రేట్లను అడ్డగోలుగా పెంచి తమ పొట్టగొడుతున్నారని రైతులు చిరు వ్యాపారులతో కలిసి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. గంప కూరగాయలు తీసుకొస్తే రూ.30 వస్తే.. అందులో దళారులు, తైబజార్ నిర్వాహకులకు రూ.25 పోతే వచ్చే రూ.ఐదుతో కనీసం రవాణా చార్జీలు కూడా వెళ్లక నానాఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. […]

Read More
మాస్కు లేకుండా బయటికి రావొద్దు

మాస్కు లేకుండా బయటికి రావొద్దు

సారథి, హుస్నాబాద్: మాస్కు లేకుండా బయటకు రావొద్దని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ సూచించారు. బస్టాండ్, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాస్కులు లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్లు, బస్టాండ్ ఆవరణతో పాటు రోడ్లపై తీరుగుతున్న వ్యక్తులకు మాస్కులను పెట్టి వాటి అవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు ఎస్.శ్రీధర్, కె.రవి, ఆర్టీసీ కార్మికులు, […]

Read More