హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టుల వివరాలను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆయా శాఖల్లోని ఖాళీ పోస్టుల సంఖ్య, వాటి హోదా, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపించాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల వివరాలు వద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను పెంచిన దృష్ట్యా ఖాళీపోస్టుల సంఖ్యలో తేడాలు ఏర్పడ్డాయి. […]
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు ఎక్కడెక్కడ ఎన్ని స్థలాలు ఉన్నాయో జిల్లాలవారీగా వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని స్థలాలు కబ్జాకు గురయ్యాయో, ఆక్రమణలు జరిగాయో, నిర్మాణాలు చోటుచేసుకున్నాయో జూన్ 10వ తేదీ వరకు వివరాలు సమర్పించాలని సూచించింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను బెంచ్ గురువారం విచారించింది. వక్ఫ్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 2,186 వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. టాస్క్ ఫోర్స్ […]
సారథి న్యూస్, ములుగు: జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ఎస్.కృష్ణఆదిత్య సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు రహదారి నుంచి కలప, ఇసుక, పీడీఎస్ బియ్యం, మారకద్రవ్యాల స్మగ్లింగ్ అవుతోందని, జిల్లా నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, రేడియం స్టిక్కర్లు అతికించడం, కలరింగ్ […]
సారథి న్యూస్, ఏటూరునాగారం: ప్రజాసమస్యలపై అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను ఏటూరునాగారం పోలీసులు అరెస్టు చేయడం సరికాదని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కావిరి అర్జున్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను అణచలేరని అన్నారు. రాష్టానికి దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం […]
సారథి న్యూస్, వాజేడు: క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య పలువురు వైద్యసిబ్బందిని సత్కరించారు. పీవో హన్మంత్ జెండగే, డిప్యూటీ కలెక్టర్ ఆదర్శ్ శురభి, డీఎంహెచ్‌వో అప్పయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ చేతులమీదుగా వైద్యులు, సిబ్బందిని సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు. వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వారికి మందులు పంపిణీ చేసినందుకు హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, పేరూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉత్తమ […]
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా సాగింది. దుర్ముట్ల లక్ష్మీ, నర్సింహారెడ్డి, దుర్ముట్ల హారిక కిషన్ రెడ్డి, సందూరి జ్యోతి, రవీందర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. స్వామి వారిని ఎదుర్కోలుగా తీసుకొచ్చి ముత్యాల పందిరిలో కూర్చోబెట్టగా వేదపండితులు కల్యాణం జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించి కట్నకానుకలు సమర్పించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో […]