సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని బుజరనోపల్లి గ్రామానికి చెందిన దాదాపు 100 మంది కుటుంబాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీని శుక్రవారం వీడారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం కల్హేర్ మండలం ఖానాపూర్లో ఎమ్మెల్యే నివాసంలో బుజరానోపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తొలి తెలుగు మహిళ కవియిత్రి కుమ్మర్ల ఆడపడుచు మొల్లమాంబ (579)జయంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భావితరాలకు తెలిసేలా ప్రభుత్వమే జయంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుమ్మరి నాగరాజు, కుమ్మరి స్వామి, కుమ్మరి భిక్షపతి, కుమ్మరి శ్యాములు కుమ్మరి రాజు, కుమ్మరి సత్యనారాయణ, కుమ్మరి సంతోష్, కుమ్మరి లచ్చయ్య, కుమ్మరి కృష్ణయ్య, కుమ్మరి నర్సింలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: చెదిరిన గూడుకు ప్రాణంపోశారు ఓ ఆఫీసర్. ఓ వినూత్న ఆలోచనతో వాటికి నీడ కల్పించారు. ములుగు జిల్లా ప్రేమ్ నగర్ కు చెందిన అటవీశాఖ పీఆర్వో సాయికిరణ్ ఇంటి ఆవరణలో పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి. గూడు బోర్ మోటర్ బోర్డు నుంచి కింద పడిపోవడంతో సాయికిరణ్చలించిపోయారు. ఆ సమయంలో వినూత్నన ఆలోచన కలిగింది. వెంటనే పిచ్చుల కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేశారు. ఇంటి డాబా కింద అట్టలతో ఒక గూడును ఏర్పాటుచేశారు. ఆ గూడుకు […]
సారథి న్యూస్, ఏటూరునాగారం: ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ సృష్టించాడు. శుక్రవారం ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపురం గ్రామంలో సంచలనం రేకెత్తించింది. ఇదే గ్రామానికి చెందిన సాబీర్ కన్నాయిగూడెం మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ సంస్థలో దినసరి కూలీగా పనిచేసేశాడు. ఆరునెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంట్లో కుటుంబ అవసరాల కోసం భార్యతో గొడవ జరిగేది. దీంతో మనస్తాపానికి గురైన సాబీర్ మద్యం తాగి విద్యుత్ స్తంభం ఎక్కి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదిలాఉండగా, […]
సారథి న్యూస్, రామాయంపేట: మల్చింగ్ పద్ధతుల్లో కూరగాయలను పండించడం ద్వారా ఎక్కువ లాభాలను సాధించవచ్చని మెదక్ జిల్లా డి ఏ ఓ పరుశురాం నాయక్ అన్నారు. కలుపు నియంత్రణలో ఉండి మొక్కకు కావాల్సిన ఎరువులు సమపాళ్లలో అందుతాయని వివరించారు. శుక్రవారం ఆయన మండలంలోని రాజాక్పల్లి గ్రామంలో మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న కనుకరాజు అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సూచనలు, సలహాలు ఇచ్చారు.