సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ములుగు ఎస్టీయూ భవన్లో అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్ స్కూలు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్టీయూ మద్దతు ప్రకటించించిన […]
సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లోని చాలా మంది యువకుల్లో రకరకాల నైపుణ్యం ఉన్నప్పటికీ గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో వారు అక్కడే ఉండిపోతున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ప్రైజ్ మనీ అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహించడం ద్వారా యువకుల నైపుణ్యం బయటకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా ఉన్న ప్రజాప్రతినిధులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆగ్రహంలో కొట్టుకపోకతప్పదని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఆర్సీరెడ్డి స్టడీ సెంటర్, పలు స్టడీ సెంటర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ […]