Breaking News

Day: February 16, 2021

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్​ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ​సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం […]

Read More
మంత్రి కేటీఆర్ ​పరామర్శ

మంత్రి కేటీఆర్​ పరామర్శ

సారథి న్యూస్, మహబూబ్​నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​తండ్రి నారాయణగౌడ్​కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ను పరామర్శించారు. మహబూబ్​నగర్​లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
ఇందిరమ్మ ఇస్తే కేసీఆర్ గుంజుకుంటుండు

ఇందిరమ్మ ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటుండు

ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి సారథి న్యూస్​, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని […]

Read More
లోన్లను సద్వినియోగం చేసుకోవాలి

పథకాలు మంజూరు చేయండి

సారథి న్యూస్, ములుగు: స్వయం సహాయక సంఘాల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందజేస్తున్నరుణాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ ​కలెక్టర్​ ఆదర్శసురభి సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్​లో జరిగిన రివ్యూ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డెయిరీ వంటి పథకాలను అర్హత కలిగినవారికి మంజూరు చేయాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలపరిశీలన కోసం తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు ఉన్న […]

Read More
రుణాలను సకాలంలో చెల్లించాలి

రుణాలను సకాలంలో చెల్లించాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బ్యాంకుల నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీఏ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య సూచించారు. మంగళవారం మెదక్​జిల్లా చిన్నశంకరంపేట మండల సమాఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రతి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు ఉండడం, తిరిగి చెల్లింపులు చేయడం, పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండటం వంటి పంచసూత్రాలు పాటించాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి ప్రణాళిక ప్రకారమే రుణాలు పొంది ఆదాయభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం […]

Read More