సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నామని మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే 1.31లక్షల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ సమస్య లేదన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశంలోనే పారిశ్రామిక రంగానికి సరిపడా కరెంట్ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సమావేశంలో […]
సారథి న్యూస్, మానవపాడు: అయోధ్య నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో రాముడి ప్రతిమతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జనహిత, హిందువాహిని ఆధ్వర్యంలో కోలాటాలు వేశారు. నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆద్యంతం ఊరేగింపు కన్నులపండుగా సాగింది. ఎన్నో ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల నిరీక్షణ సఫలమై భవ్య రామ మందిర నిర్మాణం అవుతున్నందున అందరూ తమవంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, […]
సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్‌కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని […]
సారథి న్యూస్, ములుగు: రెవెన్యూ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఎస్.కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్‌సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీలింగ్, భూదాన్, హైవేలకు ఇచ్చిన భూముల వివరాలను సంబంధిత నమూనాలో పొందుపర్చాలని సూచించారు. 96లో మ్యుటేషన్ చేసిన రిపోర్టు ఆధారంగా రికార్డులను సరిచూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అతితక్కువ కేసులు ఉన్న జిల్లా ములుగు, భద్రాది మాత్రమేనని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన రెవెన్యూ కేసులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో […]
సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ చేతులమీదుగా టీఎస్సీపీఎస్ ఈయూ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. […]
సారథి న్యూస్, రామాయంపేట: సుమారు పదేళ్ల తర్వాత నిండిన హైదర్ చెరువులోని నీటిని 20,30 ఎకరాల సాగు విస్తీర్ణం కోసం విడుదల చేయొద్దని నార్లాపూర్ ముదిరాజ్ కులస్తులు, ఇతర గ్రామస్తులు నిజాంపేట తహసీల్దార్ జయరాంకు వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్, తిప్పనగుళ్ల, శోకత్ పల్లి గ్రామాలకు చెందిన ముదిరాజ్, బెస్త కులస్తులు ఈ చెరువులో 10లక్షల చేప పిల్లల మేర పెంచారని వివరించారు. నీటిని విడుదల చేస్తే అవి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చెరువులో నీళ్లు ఉండడం ద్వారా […]