ముంబై: విరుష్క అభిమానులకు గుడ్న్యూస్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఈ మేరకు కోహ్లి ట్వీట్ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో రామ్నారాయణ సూచించారు. సోమవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. సమావేశంలో ఈజీఎస్ ఏపీవో సుధాకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.1.23 కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్ లను అందించారు. వాటిని సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, రామాయంపేట: మానవతా హృదయం పరిమళించింది. ఆపదలో ఉన్నవారికి చేయూతనందించింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న 20 మంది ఫ్రెండ్స్ కలిసి హెల్పింగ్ హ్యాండ్స్గ్రూప్ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లా రామాయంపేట చల్మేడ గ్రామానికి చెందిన రైతు తిర్మలయ్య ఇటీవల మరణించాడు. గ్రూపు మెంబర్స్ లో ఒకరైన సోదరుడికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ వారి ఆర్థిక పరిస్థితిని వివరించారు. హెల్పింగ్ హ్యాండ్స్ […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పునఃప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలాధ్యక్షుడు గిరిబాబు కోరారు. సోమవారం ఆయన ఎంపీడీవో గణేష్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఫణింద్రచారి, ఉపాధ్యాయులు రామబ్రహ్మకుమార్, విఠోబా, స్వామి, ప్రవీణ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి.. ఆపై క్లాసెస్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. […]