Breaking News

Month: December 2020

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్​ఇళ్లు

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్ ​ఇళ్లు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్​బెడ్​రూమ్​ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్​బండి విజయ్​కుమార్ ​రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల మహాసభలను మార్చిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ జర్నలిస్టును చంపుతానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం జర్నలిస్టు సమాజాన్ని అవమానపర్చడమేనని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేను […]

Read More
చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు […]

Read More
ఆగ్రహించిన చేర్యాల జనం

ఆగ్రహించిన చేర్యాల జనం

ధ్వంసమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమ కట్టడాలు జనాగ్రహానికి ధ్వంసమైన యాదగిరిరెడ్డి కబ్జా భూమి పోలీసుల రంగ ప్రవేశం, అఖిలపక్షనాయకుల అరెస్టు సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. అక్రమ నిర్మాణం చేపట్టారని విపక్ష నాయకులు, కార్యకర్తలు వాటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి పెద్దచెరువు కింద భాగంలో కొంత ప్రదేశాన్ని దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. భూమిని ఎమ్మెల్యే […]

Read More
వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం

వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారికి సుప్రభాతసేవ, అభిషేకం, ఆరాధన నైవేద్యం, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ ప్రధానార్చకుడు రామానుజాచార్యులు తెలిపారు. పక్కనే ఉన్న శివాలయంలో పరమశివుడికి ఏకరుద్రాభిషేకాలు, దీపారాధన నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం స్వామివారి […]

Read More
రజినీకి శుభాకాంక్షల వెల్లువ

రజినీకి శుభాకాంక్షల వెల్లువ

త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్​ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్‌ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ​ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్​ చెబుతూ […]

Read More
శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు

నందివడ్డెమాన్ లో శనీశ్వర స్వామికి అభిషేకాలు పరమశివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలొచ్చి అభిషేకాలు, విశేష అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నువ్వులనూనె, నల్లటి వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను స్వామి వారికి నివేదన చేస్తారని, స్వామివారి అనుగ్రహం పొందేందుకు కొలుస్తారని ఆలయ […]

Read More
అన్ని ఆవాసాలకు భగీరథ నీరు

అన్ని ఆవాసాలకు భగీరథ నీరు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని ఆవాసిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రకటించారు. పెండింగ్​ పనులను కంప్లీట్​చేసి సింగూర్ ద్వారా మంచినీటిని అందిస్తామని, అలాగే కోమటిబండ ద్వారా శివ్వంపేటలో నిర్మిస్తున్న సంపును పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి తాగునీటి సరఫరా, నీటిపారుదల, […]

Read More
ఖానాపూర్​కు నిధులు కేటాయించండి

ఖానాపూర్​కు నిధులు కేటాయించండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం ప్రగతి భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖ శ్యాంనాయక్ కలిశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరుచేసి సహకరించాలని కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వారి వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్ ఉన్నారు.

Read More