Breaking News

Month: November 2020

అమ్మవారికి పుష్కర స్నానం

అమ్మవారికి పుష్కర స్నానం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్​ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]

Read More
తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

సారథి న్యూస్​, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రాజోలిలోని పుల్లూరు, అయిజ మండలం వేణిసోంపురం ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ స్నానాలు చేసిన అనంతరం అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. :: ఫొటోలు, సాధిక్, మానవపాడు

Read More
స్వేరోస్​ ‘పరిగి 5కే రన్’ సక్సెస్​

స్వేరోస్​ ‘పరిగి 5కే రన్’ సక్సెస్​

సారథి న్యూస్, పరిగి: స్వేరోస్​ ప్రతిజ్క్ష దివస్​ సందర్భంగా సోమవారం వికారాబాద్​ జిల్లా పరిగిలో స్వేరోస్​ ఇంటర్​నేషనల్​ నెట్​వర్క్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిగి 5కే రన్​ కార్యక్రమం విజయవంతమైంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ స్వేరో జెండాను ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల అదనపు క్రీడాధికారి డాక్టర్​ సోలపోగుల స్వాములు స్వేరో, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ రుద్రవరం సునీల్ స్వేరొ, ప్రతిజ్ఞ దివస్ కన్వీనర్ ఏపీ శేఖర్, […]

Read More
అప్పుడొస్తాడట..!

అప్పుడొస్తాడట..!

ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం ఆధారంగా తీయనున్న ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరుస అప్ డేట్స్ తో సర్​ప్రైజ్​చేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. గురువారం సినిమా విడుదల కానుండగా, వీకెండ్ సహా పంద్రాగస్టు కూడా […]

Read More
ఇదే మొదటిసారి..

ఇదే మొదటిసారి..

సౌత్​లో మంచి సినిమాలే చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కొద్దికాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్, నితిన్ తో రెండు సినిమాలకు కమిటైంది. అలాగే కోలీవుడ్ లో భారతీయుడు–2, అయాలన్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మరో ఆఫర్ రకుల్​ను వరించింది. లాస్ట్ ఇయర్ అజయ్ దేవ్​గన్​చిత్రం ‘దేదే ప్యార్ దే’ లో నటించింది. అందులో రకుల్ గ్లామరస్ రోల్ అందరినీ మెప్పించింది. మోతాదుకు మించి గ్లామర్ ఒలకబోసింది. దీంతో […]

Read More
అరాచకం కావాలా? అభివృద్ధి కావాలా?

అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?

సారథి న్యూస్, హైదరాబాద్: ఆరేండ్ల మూడు నెలల పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీట్​ది ప్రెస్ ​కార్యక్రమంలో మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్​లోనే పెరిగి చదువుకున్నానని.. ఎర్రమంజిల్​లో ఉంటూ జలమండలి ఆఫీసు […]

Read More
సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: ‘అందరినీ సల్లంగా సూడు పోచమ్మ తల్లి’ అంటూ మహిళలు, ఆడపడుచులు అమ్మవారిని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో ఘనంగా బారడీ పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పెద్దసంఖ్యలో మహిళలు కలశాలు, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. బోనాలు, ఎడ్ల బండ్లు […]

Read More
ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ […]

Read More