సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ నిర్వహణ అభాసుపాలవుతోంది. నిర్వాహకులు బుక్స్, సెలఫోన్స్ ముందుపెట్టుకుని ఎగ్జామ్స్ రాయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజీలో నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా ఒకే రూమ్ లో 40 మందిని కిక్కిరిసి కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తున్నారు. నిర్వాహకులు విద్యార్థుల వద్ద ఒక్కో సబ్జెక్ట్ కు కొంత […]
డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50 మహిళలకు 75 స్థానాల కేటాయింపు అన్ రిజర్వ్డ్ డివిజన్లు 44 అంతా రెడీచేసిన బల్దియా అధికారులు హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా […]
సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్‌జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు […]
సారథి న్యూస్, వాజేడు, ములుగు: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మీసేవా, ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూసంబంధిత సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 47 మీసేవా సెంటర్లు, 60 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయించిన […]