సారథి న్యూస్, సూర్యాపేట: రెండేళ్లకు ఒకసారి జరిగే.. తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళాగా భావించే లింగమంతుల జాతరకు నగారా మోగింది. జాతర నిర్వహణపై సూర్యాపేటలోని క్యాంపు ఆఫీసులో గురువారం దేవాదాయశాఖ అధికారులు, యాదవ కులపెద్దలు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. వేడుక ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే 2021 ఫిబ్రవరి 14న ఆదివారం దిష్టిపూజ […]
సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 16,971 మంది రైతుల నుంచి 51,746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.51కోట్లను వారి ఖాతాలో జమచేశామని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం ధాన్యాన్ని కూడా కొని మిల్లులకు తరలిస్తున్నామని, ఇందులో ఎలాంటి ఇబ్బందుల్లేవని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కూడా ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో […]
న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు […]
ముంబయి: ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభంకానున్న టీ20, వన్డే టోర్నీల్లో కోహ్లిసేన న్యూజెర్సీలో కనిపిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ గా మారాయి. ఇప్పుడున్న బ్లూ రంగులో కాకుండా నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో బీసీసీఐ అందించిన సరికొత్త కిట్లతో టీమిండియా సభ్యులు ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న న్యూజెర్సీలు […]
సారథి న్యూస్, పోలాకి(శ్రీకాకుళం): వంశధార ప్రాజెక్టు త్వరలోనే పూర్తిచేస్తామని, అన్నదాతలను అన్నిరకాలుగా ఆదుకుంటామని, శ్రీకాకుళం జిల్లా స్థితిగతులు, రూపురేఖలను సమూలంగా మార్చుతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో ప్రజల కోసం నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గురువారం 7వ రోజు సంఘీభావ యాత్రలో పాల్గొన్నారు. పోలాకి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎంపీడీవో ఆఫీసు వరకు చేపట్టిన యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన తడెం మలేశం కుమారుడు సాయికుమార్ కు మెదడు నరాల సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు చికిత్సకు అవసరమయ్యే రూ.1.5లక్షల ఎల్వోసీని గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, నాగరాజు, నర్సింలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్ చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ శృతిఓజా, ఎస్పీ రంజన్రతన్ కుమార్తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్డబ్ల్యూఎస్శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని […]