పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్‌సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా […]
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ 46వ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. ఎలక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను మేజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ కు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించి పరాజయం పొందారు. అధ్యక్షుడిగా […]
బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్ నీట మునిగిందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]
సారథి న్యూస్, ఖమ్మం: ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎల్పీ సారథ్యంలోనూ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఈనెల 18న కల్వకుర్తికి వెళ్తున్నట్లు భట్టి చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈనెల 11న ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు, ఖమ్మం నగర […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): అయిజ మండలం వేణిసొంపురం గ్రామంలో తుంగభద్ర నది పుష్కరాల ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు. విద్యుద్దీకరణ, మహిళల స్నానాల గదులు, వాహనాల పార్కింగ్ స్థలం.. తదితర వాటికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ కృష్ణ, ఆర్డీవో రాములుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుంగభద్ర నది ఒక్క అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే ప్రవహిస్తుందని, పవిత్రమైన పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాకు తలమానికమైన పిల్లలమర్రి పునర్జీవం సాధించింది. పట్టణ శివారులోని సుమారు మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. 700 ఏళ్ల వయస్సు ఉన్న ఈ మర్రివృక్షం ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా వెలుగొందింది. మర్రి వృక్షాల కొమ్మలు, వేర్లకు చెదలు, శిలింద్ర వ్యాధులు సోకడంతో క్రమక్రమంగా క్షీణించింది. ఇది గమనించిన పూర్వ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ప్రత్యేక చొరవ తీసుకుని బొటానికల్ గార్డెన్ శాస్త్రవేత్తలు, సంబంధిత డాక్టర్లను పిలిపించి సంరక్షణ చర్యలు చేపట్టారు. దీంతో పిల్లలమర్రి 140 […]