Breaking News

Day: November 4, 2020

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో దళితులను ముదిరాజ్​ కులస్తులు బహిష్కరించానే ఫిర్యాదులపై మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. పంచాయతీ ఆఫీసు వద్ద గ్రామస్తులు అందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రవి, పెద్దశంకరంపేట ఎస్సై సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్​ చరణ్ సింగ్, అరె ప్రభాకర్, సర్పంచ్ సరిత మల్లేశం పాల్గొన్నారు.

Read More
అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల భర్తీకి అవుట్​సోర్సింగ్​విధానంలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు పశువుల హాస్పిటల్స్​లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులకు షెడ్యూల్ తెగలకు చెందినవారు మాత్రమే అర్హులని, పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లమో […]

Read More
రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

రైతులను నాశనం చేసేలా వ్యవసాయ చట్టాలు

సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్​లోని ఆర్​టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]

Read More
ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

సారథి న్యూస్, మహబూబాబాద్: వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వరి ధాన్యం, మక్కలు, పత్తిని కొనుగోలు చేసేందుకు అంతా రెడీ చేయాలని సూచించారు. టార్పాలిన్​ కవర్లు, తేమశాతం మిషన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్​వో నర్సింగరావు, ఏపీడీ వెంకట్, డీఎంవో సురేఖ, […]

Read More
పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్​లో ఆయన ceotelangana.nic.in వెబ్​సైట్​లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్​లైన్​లో లేదా తహసీల్దార్​ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ […]

Read More
‘రిపబ్లిక్’ ఎడిటర్​అర్నబ్ గోస్వామి అరెస్ట్​హేయం

‘రిపబ్లిక్’ ఎడిటర్​ అర్నబ్ గోస్వామి అరెస్ట్​ హేయం

సారథి న్యూస్, హైదరాబాద్: రిపబ్లిక్​టీవీ చీఫ్ ​ఎడిటర్ ​అర్నబ్​గోస్వామిని అరెస్ట్ ​చేయడం అప్రజాస్వామిక చర్య​ అని జర్నలిస్టు అసోసియేషన్ ​ఆఫ్ ​తెలంగాణ(జాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి విమర్శించారు. రాజకీయ కక్షతో మీడియాకు సంకేళ్లు వేయడం హేయమైన చర్య అని ఖండించారు. అధికారబలంతో భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జాతీయభావాలను ప్రకటించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. జాతివ్యతిరేక శక్తులపై దేశభక్తితో పోరాడే పత్రికాప్రతినిధులు, మీడియా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో […]

Read More
సగం కాలిన డెడ్​బాడీ లభ్యం

సగం కాలిన డెడ్​బాడీ లభ్యం

సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్​బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆచూకీ తెలిసిన వారు ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డెడ్​బాడీని గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. […]

Read More