సారథి న్యూస్, బిజినేపల్లి: రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. పోర్టల్‌ను తహసీల్దార్అంజిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కురుమయ్య, పీఏసీఎస్చైర్మన్బాలరాజు గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మహేష్ రెడ్డి, మంగి విజయ్, బాలస్వామి, తిరుపతిరెడ్డి, పులిందర్ రెడ్డి పరిశీలించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్పుట్ సబ్సిడీకి […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, […]