సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశానుసారం దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి వెంట మాజీ ఎంపీపీ రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, ఎంపీటీసీ దామోదర్, శివాయపల్లి సర్పంచ్ నరేష్, ఉపసర్పంచ్ అంజయ్య, కమలాపూర్ సర్పంచ్ రాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారం సంగయ్య, సెట్ రోషిరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నందున జూరాలకు ప్రస్తుతం ఐదులక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. క్రమేణా ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. బ్యాక్ వాటర్ వల్ల ఈ దిగువ సూచించిన గ్రామాలు ప్రభావితం కావచ్చు. అందువల్ల నదీ పరివాహక గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతిఓఝా సూచించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, […]
సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల వివరాల మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, పద్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు సాహితీని అదే గ్రామానికి చెందిన హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేసే జింకల కిరణ్ కుమార్ రెడ్డికి 50 […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరెంట్ షాక్‌తో తండ్రి కొడుకులు ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఇస్కపాయల తండా పంచాయతీ పరిధిలోని కొలపల్లితండాకు చెందిన ధారవత్ హర్యానాయక్(51) కొలపల్లికి చెందిన చాకలి సాయిలు పొలాన్ని కౌలుకు పంట సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి పొలాన్ని నీళ్లు చూసేందుకు వెళ్లాడు. పక్క పొలానికి చెందిన చాకలి లింగం అడవి పందుల కోసం కరెంట్ వైర్ బిగించాడు. […]
ఒకే ఒక కన్నుగీటుతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ల జాబితాలోకి వెళ్లిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే పాపులారిటీ తో పాటు ట్రోలింగ్ బాధ కూడా తప్పడం లేదు ప్రియకి. రీసెంట్ గా ప్రింటెడ్ లెహంగా ధరించిన ప్రియా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఆమె లుక్ పై కొందరు కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేశారు. ఈసారి మాత్రం ప్రియ ఏ మాత్రం బెదరకుండా.. ‘మీరు చేసిన కామెంట్స్ లో […]
గురువారం సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి బ్రేకప్ సాంగ్‌ను సోషల్ మీడియా ద్వారా చిరంజీవి విడుదల చేశారు. ‘ఒగ్గేసిపోకే అమృతా నేను తట్టుకోక మందు తాగుతా. ‘ఒట్టేసి చెబుతున్న అమృతా’ అంటూ సాగే ఈ పాటను నకాష్ అజిజ్ పాడగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. తమన్ సంగీత దర్శకుడు. నభా నటేశ్ హీరోయిన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. చిరు సాంగ్ […]
సారథి న్యూస్, మెదక్: మంజీరా నది వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను గురువారం హెలికాప్టర్సహాయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సూపర్వైజర్గా పనిచేసే కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే నాగరాజు, దుర్గాప్రసాద్, వాచ్‌మెన్‌గా పనిచేసే శ్రీధర్లు రోజు మాదిరిగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం నదిపాయ ఒడ్డున ఉన్న బాయర్ సీడ్ కంపెనీ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లారు. వారితోపాటు కిష్టాపూర్‌కు […]
షార్జా: ఐపీఎల్ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్ ఫించ్(20), దేవదూత్ పడిక్కల్(18) నిరాశపరిచారు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్ కాగా, అర్షదీప్ బౌలింగ్‌లో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. […]