తొలుత కొంత చప్పగా సాగిన బిగ్‌బాస్ హౌస్ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్‌బాస్ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్, కుమార్ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్‌సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]
సుశాంత్ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, నమ్రదా శిరోద్కర్‌కు ఎన్సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్ ప్రీత్‌సింగ్‌కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం […]
తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్ […]
రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి అబుదాబి: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన కలకత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్‌యాదవ్28 […]