సారథి న్యూస్, కర్నూలు: రెండు నెలల్లో కర్నూలు, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమవుతాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఎయిర్ పోర్ట్ ను అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు. పెండింగ్ ఉన్న 17 రకాల పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సూచించారు. […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి పంచాయతీ ఉప సర్పంచ్సంతకాన్ని అదే గ్రామ సర్పంచ్ వెంకటయ్య కొడుకు ఫోర్జరీ చేసి రూ.1.44లక్షలు డ్రా చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్తులు, వార్డుసభ్యులు సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేయని పనులకు రికార్డులు సృష్టించి సర్పంచ్ కుమారుడే చెక్కులపై సంతకాలు చేసుకుని ఎస్ టీవో ఆఫీసులో బిల్లులు డ్రా చేశాడని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీచేసేందుకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్ దక్కడం దాదాపు ఖాయమనే […]
ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడీ నేత మనోజ్ ఝూ పై హరివంశ్ గెలుపొందారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ముజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి.. హరిశంశ్ సింగ్ గెలుపొందినట్టు ప్రకటించారు. 2018లో హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవికాలం ముగియడంతో ఆయన మరోసారి పోటీలో నిలిచారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యుల […]
చైతన్య తమ్హానే.. మరాఠీలో పేరున్న డైరెక్టర్. 2014లో ఆయన తీసిన ‘కోర్ట్’ అనే సినిమాతో చాలా ఫేమ్ సంపాదించాడు. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన చైతన్య ఇప్పుడు ఇండియాలోనే కాదు తను రీసెంట్గా తీసిన మూవీతో వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులు దక్కించుకుని వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ‘ది డిసైపుల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం ఒక యువ సంగీత దర్శకుడి సినీప్రయాణం.. జీవితంలో అతడుపడ్డ కష్టాలు.. వాటిని ఎలా […]
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్ శాఖ తరఫున జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్2న స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన ఆయా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ బి పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందన్నారు. అధికారులు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: శాసనసభలో తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లు– 2020 ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోత విధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు చట్టంగా మార్చేందుకు సభ మందుకొస్తున్నామన్నారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.577 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ […]
రీసెంట్గా కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చిందన్న విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుషాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఆమె సోదరుడు సహా మరికొంతమందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రియా చక్రవర్తి అరెస్టయి కొంతమంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అయితే వాటిలో ముందుగా వినిపించినవి రకుల్ […]