బుల్లితెర యాంకర్ గా ఎంత ఫేమ్ సంపాదించిందో నటిగా కూడా అన్నే మార్కులు కొట్టేసింది అనసూయ. అంతగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘రంగస్థలం’ తర్వాత సోలో హీరోయిన్ గా ‘కథనం’ సినిమా చేసింది. సినిమా అంతగా ఆడకపోయినా అనసూయ నటనకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కథలో తనపాత్ర కీలకంగా ఉండడంతో అనసూయ వెంటనే ఓకే అనేసిందట. బుల్లితెర, వెండితెర […]
చిలిపి అమ్మాయిగా, అల్లరి పిల్లగా ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ పక్కన నటించింది.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిగా నితిన్ తో కలిసి ‘భీష్మ’లో పార్టనర్ షిప్ కలిపింది. రెండు సినిమాలు రష్మికకు మంచి నేమ్ తెచ్చాయి. చాలా తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయి మంచి చాన్స్లనే దక్కించుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే చిరు, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో […]
సారథి న్యూస్, రామయంపేట: రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేస్తూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు పీఏసీఎస్సొసైటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేటలో సహకార సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించారు. గతంలో సొసైటీల పనితీరు ఎవరికి తెలిసేది కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వాటికి ఒక రూపు వచ్చిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అలాట్ చేశామని, […]
సారథి న్యూస్, కరీమాబాద్(ఖిల్లావరంగల్): పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలుస్తాయని కార్పొరేటర్ దామోదర్ యాదవ్ అన్నారు. ఆదివారం నగరంలోని 8వ డివిజన్లో 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేదల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలంతా సీఎం, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బోగి సురేష్, లబ్ధిదారుల కుటుంబాలు పాల్గొన్నాయి.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి తిరుచ్చిసేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయపాలకవర్గం వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా భక్తులు హాజరుకాలేదు. వేదపండితులు, పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ ఘట్టం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ప్రధాన పూజారులు […]
సారథి న్యూస్, రామగుండం: వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే మహాసంకల్పంతో మఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలం కావడంతో గోదావరికి జలకళ సంతరించుకుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నదీతీరాన్ని పర్యాటక హబ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఆదివారం గోదావరి నది వద్ద అడ్వంచర్ అండ్ అక్వా, టూరిజం డెవలప్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమైక్యపాలనలో […]
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆదివారం ఓ శతాధిక వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుడైన కొండాపురం హన్మిరెడ్డి(103) 1917 లో జన్మించాడు. అయితే ఎప్పుడు చలాకీగా ఉండే హన్మిరెడ్డి తన పని తాను చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. ఈనెల 9న ప్రమాదవశాత్తు కాలు జారిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతిచెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.
సారథి న్యూస్, రామగుండం: ప్రైవేట్ స్కూళ్ల సమస్యలను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ట్రస్మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీ అరుకాల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆదర్, సండే సల్మారావు ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని, టీచర్ల జీతాలు ఇవ్వాలని, విద్యారంగాన్ని రక్షించాలని, టీచర్లకు నెలకు రూ.10వేల జీవనభృతి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.