Breaking News

Day: September 12, 2020

శ్రీశైలం ఆరుగేట్ల ఎత్తివేత

శ్రీశైలం ఆరుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి 13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 17గేట్లను ఎత్తివేశారు. 1,51,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 1,59,542 క్యూసెక్కులుగా నమోదైంది. నీటి ప్రవాహంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాద వాతావరణాన్ని పంచుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు […]

Read More
చివరి ఆయకట్టు దాకా సాగునీరు

చివరి ఆయకట్టు దాకా సాగునీరు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహం అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో లిఫ్ట్​ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అలంపూర్​మండలానికి మూడు లిఫ్టులను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషిరాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం […]

Read More
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

సారథి న్యూస్​, గోదావరిఖని: స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ కు వచ్చిన కేంద్ర రసాయన ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్​ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. వారిలో కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జ్​ఎంఎస్ రాజ్ ఠాకూర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం నందు, ఫక్రుద్దిన్, నగునూరి రాజు, పెండ్యాల మహేష్, నాజిమొద్దిన్, కౌటం సతీష్​ పాల్గొన్నారు.

Read More
పకడ్బందీగా నూతన రెవెన్యూ చట్టం అమలు

పకడ్బందీగా నూతన రెవెన్యూ చట్టం అమలు

ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే లక్ష్యం రెవెన్యూశాఖలో ప్రమోషన్లు ప్రక్రియను పూర్తిచేయాలి ట్రెసా ప్రతినిధుల సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్: ప్రజల కేంద్ర బిందువుగానే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేద్దామని పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిభవన్​లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ […]

Read More
పేదల కోసం జగనన్న పథకాలు

పేదల కోసం జగనన్న పథకాలు

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శనివారం కర్నూలు నగరంలోని జొహరాపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, జగన్న గోరుముద్దు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష తదితర పథకాలు పేదల కోసమే అమలుచేస్తున్నారని వివరించారు. 161 స్వయం సహాయక సంఘాలకు రూ.4,17,87,908ను నాలుగు విడతల్లో జొహరాపురంలో ఇస్తున్నామని తెలిపారు. మొదటి విడత రూ.1,04,46,977ను 161 స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి […]

Read More
ఐఐటీ జేఈఈ మెయిన్స్లో శ్రీ చైతన్య విద్యార్థుల హవా

ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో విద్యార్థుల హవా

సారథి న్యూస్​, కర్నూలు: ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ 2020 పరీక్షల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ స్థాయిలో 100 కు 100 పర్సెంటేజ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 24, అందులో శ్రీ చైతన్య విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. వివిధ కేటగిరీల్లో జి.చంద్రడేవిడ్ 164, ఆర్.సుధాకర్ నాయక్ 311, పి.వంశీకృష్ణ 919వ ర్యాంకులు సాధించినందుకు ఏజీఎం మురళీకృష్ణ అభినందించారు. బి.శ్రీజ 98.58, హెచ్ […]

Read More
షూటింగ్ నుంచి గాయబ్

షూటింగ్ నుంచి గాయబ్

సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య గురించి ఎంక్వయిరీ చేస్తుంటే రోజుకో కొత్త న్యూస్ బయటపడుతోంది. అటు ఇటు తిరిగి అది డ్రగ్స్​తో ముడిపడింది. అతనికి డ్రగ్స్ ఇచ్చిందన్న విషయం తెలిసి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రిచా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రిచా నోరు విప్పడంతో సెలబ్రిటీల మెడలకు ఉచ్చు బిగుసుకుంటోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో […]

Read More

ఎన్నికలవేళ.. బీహార్​కు భారీప్యాకేజీ

బీహార్​పై ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.16వేల కోట్ల తాయిలాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రధాని మోడీకి బీహార్​కు నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ బీహార్​కు రూ.16వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన రానున్న 10 రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ తదితర […]

Read More