వైట్ గాగ్రా.. గ్రీన్ దుప్పటా డ్రెస్‌లతో ఇద్దరు ముద్దుగుమ్మలు ‘కన్నానులే’ అన్న పాటను ఎంచక్కా పచ్చని చెట్లమధ్య ఆడి పాడి అలరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరైతే ఆమె స్నేహితురాలు ఉమాంగ్ గుప్త. వీరిద్దరూ కలిసి మణిరత్నం ‘బొంబాయి’ క్లాసిక్ మూవీలోని పాట చరణానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ రిక్రియేట్ చేశారు. ఈ పాటలో ఫర్మామెన్స్‌ను చూసి చాలామంది లావణ్యను పొగడ్తల్లో ముంచెత్తారు. […]
డార్లింగ్ ప్రభాస్ వరుసగా చిత్రాలను అనౌన్స్ చేసి ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రిక్రియేట్ చేశాడు. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించనున్న భారీ ఇతిహాస చిత్రం ‘ఆది పురుష్’ మూవీకి సంబంధించిన ఒక అప్ డేట్ రానుంది. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. టీ సీరీస్ బ్యానర్‌పై అత్యంత భారీస్థాయిలో భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఇందులో కలియుగ రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ ఓం […]
సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంను పరిమితి స్థాయిలో సరఫరా చేసుకోవచ్చని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మద్యం విక్రయించడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించాన్న లక్ష్యంతో పెద్దమొత్తంలో తెంగాణ, కర్ణాటక నుంచి కొందరు మద్యం తెప్పిస్తున్నారు. గురువారం కర్నూలు మండలం జి.సింగవరం గ్రామం వద్ద సీఐ రాజశేఖర్ గౌడ్ నేతృత్వంలో పోలీసు వాహనాలను తనిఖీచేయగా పెద్దమొత్తంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. కల్లూరు మండలం దూపాడుకు చెందిన బోయ […]
తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి అరుదైన రికార్డు సాధించింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు అందించే ఆమె ‘జ్యోతక్క’ పేరుతో ఆగస్టు 1వ తేదీన స్టార్ట్ చేసిన యూ ట్యూబ్ చానెల్‌కు అతితక్కువ కాలంలోనే లక్ష మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్ చేసిన వీడియోస్‌ను సుమారు 7.67లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె సబ్స్ర్కైబర్స్కు థ్యాంక్స్ చెప్పింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు న్యూస్ చానెల్ వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ కే భవన్ లో అన్నిశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నిశాఖలు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం తయారు చేయాలని, శాసనమండలి, శాసనసభలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని, అసెంబ్లీ అధికారులతో […]
సారథి న్యూస్, మిడ్జిల్: సాధారణంగా అన్ని గ్రామాల మాదిరిగానే ఆ ఊరులోనూ ఎక్కువగా వలస వెళ్లి బతికే కూలీలు, కార్మికులు ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఏ ఇల్లూ చూసినా ఇంటిల్లిపాదితో కళకళలాడుతోంది. ఆ గ్రామంలో ఏ పండుగనైనా కలిసిమెలిసే జరుపుకుంటారు. అయితే గ్రామస్తులంతా పెద్దఎత్తున జరుపుకునే వేడుకల్లో పీర్ల పండగ ఒకటి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొహర్రం తర్వాత ఈ గ్రామంలో నిశ్శబ్దం ఆవహించింది. […]
ఐరాస: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువై పేదలు మరింత దారిద్ర్యం బారినపడుతున్నారు. కరోనా వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. పేదరికాన్ని అంతమొందించేందుకు దశాబ్ద కాలంగా తాము చేస్తున్న కృషి వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజాగా దాన్ని సవరిస్తూ 9.1 […]
సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్‌జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. […]