సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో గతంలో లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలు, వ్యాపారులకు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, 9 రోజులుగా లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నివారించగలిగామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని వ్యాపార సంస్థలు యథావిధిగా నడుపుకోవాలని సూచించారు. […]
సారథి న్యూస్, దేవరకద్ర: దేవరకద్ర వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూతో పాటు కండువా, స్వామివారి పంచెలకు వేలంపాట నిర్వహించారు. చాలామంది భక్తులు వేలంపాటలో పాల్గొని వాటిని కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడిని దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండరపల్లి వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, అర్చనలు […]
చేతికొచ్చిన పంట కీటకాల పాలు లబోదిబోమంటున్న మెదక్ జిల్లా రైతులు ‘ పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఈసారి అవేవో మిడతలు కొత్తగా వచ్చాయి. పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అవి ఎలా పోతాయేమో.. వరి పంటపై కింది భాగాన, ఆకులపైన కొరికి వేస్తున్నాయి. దీంతో కష్టపడి సాగుచేసిన పంటంతా నేలపాలవుతోంది. పెట్టుబడి కూడా చేతికి రాదేమో..’ అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. సారథి న్యూస్, నర్సాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పైరు […]
బాలీవుడ్ డ్రగ్మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్‌కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్‌కు డ్రగ్ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]
నాని మూవీ ‘జెంటిల్మెన్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. అయితే నివేదా బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మంచి నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం సంపాదంచింది. ‘పాపనాశం’ సినిమాలో కమల్ హాసన్ కూతురుగా నటించింది. నాని ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నివేదా థామస్.. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో 9రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఆయా మండపాల వద్ద కొలువుదీరిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. ఈ సారి కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో వేడుకలను కొంత నిరాడంబరంగానే జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎస్పీ డాక్టర్ఫక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి.. తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.మత సామరస్యానికి ప్రతీకఅంతకుముందు నగరంలోని రాంభట్ల ఆలయం […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 10,603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు చేరింది. తాజాగా, 88 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిళ్లను పరీక్షించారు. అలాగే 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కోలుకున్న రోగుల సంఖ్య […]